Home » ఎన్టీఆర్ పక్కన నటించడానికి జాన్వీ కపూర్ అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా…?

ఎన్టీఆర్ పక్కన నటించడానికి జాన్వీ కపూర్ అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా…?

by AJAY
Ad

శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ సోషల్ మీడియా లో అందాల ప్రదర్శన తో మిలియన్స్ కొద్ది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకూ జాన్వీ కి సరైన హిట్ పడలేదు కానీ క్రేజ్ మాత్రం చాలానే ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అయిన కొత్తలో టాలీవుడ్ లో సినిమా చేస్తుందని వార్తలు వినిపించాయి.

Advertisement

కానీ అప్పట్లో జాన్వీ సౌత్ ను చిన్న చూపు చూసింది. అయితే ఇప్పుడు మాత్రం సౌత్ అందులోనూ టాలీవుడ్ దేశం లోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. దాంతో బాలీవుడ్ తారలు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ కూడా చాలా ఇంటర్యూ లలో టాలీవుడ్ లో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా అని చెప్పింది.

Advertisement

ఇక కొద్దిరోజులుగా జాన్వీ కపూర్ కు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అని కూడా టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హీరోయిన్ కోసం జాన్విని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి ముద్దుగుమ్మ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు గా టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఎంత అనేది క్లారిటీ లేదు కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ గట్టిగానే డిమాండ్ చేసినట్టు టాక్. చివరికి మరి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading