Telugu News » Blog » జ‌గ్గారెడ్డి రాజీనామాపై నిర్ణ‌యం అప్పుడేన‌ట‌..!

జ‌గ్గారెడ్డి రాజీనామాపై నిర్ణ‌యం అప్పుడేన‌ట‌..!

by Anji
Ads

సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో జ‌గ్గారెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఆయ‌న మాట్లాడారు. రాజీనామా, కొత్త పార్టీ అనే చ‌ర్చ ఈరోజు లేద‌ని మీ అంద‌రి ఆలోచ‌న ఏమిటో త‌న‌కు తెలుసని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. త‌న‌కు టీఆర్ఎస్ వెళ్లే ఉద్దేశం లేద‌ని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇండిపెండెంట్ ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న అన్నారు.

Also Read :  “అత‌డు” త‌ర‌వాత సినిమాలు నిర్మించ‌ని ముర‌ళీ మోహ‌న్…కార‌ణం ఏంటో తెలుసా..!

ఒక‌వేళ కొత్త పార్టీ పెడితే త‌న‌తో ఎంత మంది వ‌స్తార‌ని ఆయ‌న అడిగారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు కోరిన‌ట్టు జ‌గ్గారెడ్డి మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే జ‌గ్గారెడ్డి వెంట ఉంటామ‌ని పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మ‌ధు స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. 2018లో ఎమ్మెల్యే గా గెలిచిన త‌రువాత వ‌రుస‌గా ఎన్నిక‌లు వ‌చ్చాయి. త‌రువాత క‌రోనాతో 20 నెల‌ల పాటు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌ల‌వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని జ‌గ్గారెడ్డి అభిప్రాయ ప‌డ్డారు.

ఈ రెండేళ్లు త‌న‌కు చేత‌నైన సాయం చేశాన‌ని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీతో మాట్లాడిన త‌రువాత‌నే రాజీనామాపై నిర్ణ‌యం తీసుకుంటాను అని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. సోనియా, రాహుల్ గాంధీల‌ను క‌లిసిన త‌రువాత సానుకూల నిర్ణ‌యం రావాల‌ని దేవుడిని కోరుకుంటున్నానని ఒక‌వేళ పాజిటివ్ నిర్ణ‌యం రాక‌పోతే పార్టీ నుంచి బ‌య‌టకు వెళ్లిపోతాన‌ని తెలిపారు. తాను బ‌య‌ట‌కు ఎందుకు వెళ్లాల‌నుకుంటున్నానో పార్టీలో చాలా మందికి తెలుసు అన్నారు. త‌న వెంట నాయ‌కులు రాకుంటే ఊరికి ప‌ది మంది డ‌ప్పుల వాళ్ల‌ను ప‌ట్టుకుంటాన‌ని జ‌గ్గారెడ్డికి ఊర్లో కార్య‌క‌ర్త అంటూ ఎవ‌రూ లేరని జ‌గ్గారెడ్డి వ‌స్తుండు అని డ‌ప్పు చాటింపు వేయిస్తాన‌ని అప్పుడు క‌నీసం 50 మంది అయినా త‌న‌తో రారా అంటూ ప్ర‌శ్నించారు.

Also Read :  పుష్ప సినిమా లో రష్మిక ఫ్రెండ్ గా నటించిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?


You may also like