టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు బోయపాటి. రీసెంట్ గా బోయపాటి అఖండ సినిమాతో మరో మాస్ హిట్ ను అందుకున్నారు. అయితే బోయపాటికి ఓ బ్యాడ్ హాబిట్ కూడా ఉందట. సెట్స్ లో బోయపాటి బూతులు మాట్లాడతారట. ఈ విషయాన్ని బోయపాటి విలన్ గా ఇంట్రడ్యూస్ చేసిన జగపతిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
అంతే కాకుండా జగపతి బాబు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో జగపతి బాబు వరుస ఆఫర్ లు అందుకుంటున్నారు. ప్రస్తుతం విలన్ గా నటుడిగా జగపతి బాబు ఫుల్ బిజీ అయ్యారు. ఇక బోయపాటికి జగపతి బాబు కు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయట. కాగా బోయపాటి శ్రీనుకు ఓ బ్యాడ్ హాబిట్ ఉందని సెట్ లో బూతులు మాట్లాడతాడని జగపతి బాబు వెల్లడించారు.
Advertisement
Advertisement
also read : ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ఫోటో గ్యాలరీ ..!
అది తనకు నచ్చలేదని జగపతి బాబు అన్నారు. దాంతో తాను పదేపదే బోయపాటికి ఆ అలవాటును మానుకోవాలని సూచించానని చెప్పారు. బోయపాటితో వర్క్ చేసిన సీనియర్ హీరోలు మరియు ఇతరులు కూడా బోయపాటికి అదే సూచించేవారట. దాంతో బోయపాటి శ్రీను ఆ అలవాటును తగ్గించుకున్నాడట.
రీసెంట్ గా అఖండ సినిమా షూటింగ్ లో బోయపాటి కూల్ గా బూతులు మాట్లాడకుండా కనిపించారట. బోయపాటి అలా మారడం తనకు చాలా సంతోషంగా ఉందని జగపతి బాబు వెల్లడించారు. ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అఖండలోనూ జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే.