ప్రస్తుతం రాజకీయాలు చాలా కమర్షియల్ అయిపోయాయి. డబ్బు లేనిదే… ఏ పని కావడం లేదు. అర్థబలం, అంగబలంతో బడా కార్పోరేట్ల అండదండలతో రాజకీయాలను శాసిస్తున్న రోజులు ఇవి. ప్రజాప్రతినిధుల సమస్త విషయాలు ఎన్నికల కమిషన్ కు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఎన్నో విషయాల్ని దాస్తూ, అభ్యర్థులు రాజకీయ ఆటకు తెరలేపుతారు. ఎన్నికల అఫీడవిట్ సమర్పించే సమయంలో సదరు అభ్యర్థి తన గురించిన సమస్త వివరాలు ఈసీకి సమర్పించాలనేది నిబంధన.
Advertisement
ఈ అఫిడవిట్ ప్రకారం ఎవరు అత్యంత ధనిక సీఎం? ఎవరిపై అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి? అనే వివరాలతో తాజాగా ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక వార్త కథనం వెలువరించింది. వివరాల్లోకి వెళితే, ఇండియాలోనే అత్యంత ధనిక సీఎంగా వైఎస్ జగన్ ఉన్నారని అంటుంది వెట్ పత్రిక “ది ప్రింట్”. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల అఫీడవిట్లను పరిశీలించి ఏడు ఆసక్తికరమైన అంశాలను ప్రచురించింది. 373 కోట్ల రూపాయల ఆస్తులతో జగన్ ధనిక సీఎంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 132 కోట్ల రూపాయలతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ కండు రెండో స్థానంలో ఉన్నారు.
Advertisement
ఒడిశా సీఎం 63 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. నాగాలాండ్ సీఎం నీపు రియో రూ. 28 కోట్లు, ఛత్తీస్గడ్ సీఎం భూపేష్ 15 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తుల విలువ 13.72 కోట్లు. త్రిపుర సీఎం ఆస్తుల విలువ 11.28 కోట్లు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్తుల విలువ రూ. 7.18 కోట్లు. ఇక మిగిలిన ముఖ్యమంత్రులంతా 10 కోట్లకు లోపే ఆస్తులు కలిగి ఉన్నారు. ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తిగా బెంగాల్ సీఎం మమతా నిలిచారు. ఆమెకు కేవలం 15 లక్షల విలువైన ఆస్తి మాత్రమే ఉంది. ఉద్యమాల సమయంలో నమోదైన కేసు కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై అత్యధికంగా 64 కేసులు ఉన్నాయి. జగన్ పై 38 కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ పై 47 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
READ ALSO : ఫ్యాన్స్ కు షాక్..విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ !