Home » జగన్ కి ఈ ఆహారం చాలా ఇష్టం.. ఫిట్ నెస్ సీక్రేట్ ఏమిటో తెలుసా..?

జగన్ కి ఈ ఆహారం చాలా ఇష్టం.. ఫిట్ నెస్ సీక్రేట్ ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి గురించి చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఒక్కొక్కసారి పర్సనల్ విషయాలు వంటివి కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. తాజాగా జగన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యంగా ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటారు. ఆయన వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటకి రావు. కానీ ఇప్పుడు ఒక విషయం బయటకి వచ్చింది మంత్రి రోజా జగన్ ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడటం జరిగింది. జగన్ కి ఇష్టమైన ఆహారం గురించి ఆమె చెప్పారు ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.

Advertisement

ఆరోగ్యానికి జగన్ ఎంతగానో ప్రాధాన్యతను ఇస్తారు. ఆరోగ్యానికి తగ్గట్టు ఆహారాన్ని తీసుకుంటారు. ఆయనకు మామిడికాయ తురుముతో చేసిన పులిహోర అంటే చాలా ఇష్టమట. ఉదయం నాలుగున్నర గంటలకి జగన్ నిద్ర లేస్తారు. ఒక గంట సేపు యోగా చేస్తారు జిమ్ కూడా చేస్తారు. ఐదున్నరకి న్యూస్ పేపర్ చదవడం అలానే అందులో ఉండే ముఖ్యమైన అంశాలని తీసుకుని నోట్స్ తయారు చేసుకుంటారట. ఆ టైంలో టీ మాత్రమే తాగుతారు. ఏడు గంటలకి జ్యూస్ తాగుతారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి బదులు డ్రై ఫ్రూట్స్ ని తింటారు. సమీక్షలు చేసే సమయంలో చాక్లెట్ బైట్స్ ని తింటారు.

Advertisement

మధ్యాహ్నం భోజనంలో అన్నం కంటే పుల్కాలని ఇష్టపడతారు. అప్పుడప్పుడు రాగి ముద్ద మటన్ కీమా తీసుకుంటారు, మధ్యాహ్నం భోజనంలో కచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. చిత్రాన్నం అంటే జగన్ కి ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. పల్లీలతో పాటు మొక్కజొన్నపొత్తులంటే ఆయనకి ఇష్టం. వీలైనప్పుడు వాటిని జగన్ తింటూ ఉంటారు. వీకెండ్ లో పూర్తిగా ఫ్యామిలీతో గడుపుతారు. జగన్ నాన్ వెజ్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యాని, మటన్ వంటివి తింటారు. ఇన్ని రకాల వంటకాలనీ ఇష్టపడినా అన్ని లిమిట్ గానే తీసుకుంటారు. లీటర్ పాలలో పచ్చి అల్లం వేసి మరిగించి తర్వాత వాటిని జగన్ తాగుతారట. ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుందని రోజా ఇంటర్వ్యూలో చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading