ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు స్థాయి నుండి తనకు నటనపై ఉన్న ఆసక్తి ప్రేమతో టాలీవుడ్ లోనే మెగాస్టార్ గా నిలిచిన హీరో చిరంజీవి. సినిమాలపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు తన టాలెంట్ తో అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలను అందుకున్నారు. అంతే కాకుండా అల్లురామలింగయ్య కు అల్లుడు అయ్యే స్థాయికి ఎదిగారు. ఇక చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.
కాగా ఆయన నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ చిత్రానికి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా సోషియో ఫాంటసీ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాకు ఒప్పించారు.
Advertisement
Advertisement
ఇక ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు రాఘవేంద్రరావుతో పాటూ జంద్యాల కూడా స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సినిమా 50 రోజులు 100 రోజులు కాకుండా ఏకంగా ఏడాది పాటూ థియేటర్లలో ఆడటం చెప్పుకోదగ్గ విషయం. మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమాకు శ్రీదేవితో పాటూ చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే కండ్లు బయర్లు కమ్మాల్సిందేనట. ఈ చిత్రానికి చిరు రూ.35 లక్షల పారితోషికం పుచ్చుకోగా శ్రీదేవి రూ.25 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట.
అప్పట్లో వీరి రెమ్యుషన్ హాట్ టాపిక్ గా మరిందట. ఇదిలా ఉండగా అతిలోక సుందరి స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ రాజకీయాల్లో ఉండటం ఇష్టం లేక మళ్లీ సినిమాల వైపు వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్యూచర్ లోనూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
also read : చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలుసా..!