Home » “జగదేకవీరుడు అతిలోకసుందరి” మూవీ వెనుక ఇంత కథ ఉందా..!

“జగదేకవీరుడు అతిలోకసుందరి” మూవీ వెనుక ఇంత కథ ఉందా..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దివంగత నటి శ్రీదేవి హీరోయిన్గా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాణంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయ్యి మే 9 వ తేదీతో 33 సంవత్సరాలు పూర్తి అయింది. తాజాగా ఈ సినిమా 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Advertisement

చిరంజీవి “జగదేకవీరుడు అతిలోకసుందరి” మూవీ కంటే ముందే కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో పలు మూవీలలో హీరోగా నటించాడు. వాటి ద్వారా చిరంజీవికి మంచి గుర్తింపు కూడా లభించింది. అలాంటి సమయంలోనే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమాలో నటించాలి అనుకున్నాడు. అలాగే అశ్విని దత్ కూడా చిరంజీవి… రాఘవేంద్రరావు కాంబినేషన్లో మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడు. దానితో వెంటనే వీరి కాంబినేషన్లో మూవీ సెట్ అయిపోయింది.

Advertisement

హీరోయిన్గా శ్రీదేవిని సెలెక్ట్ చేసుకున్నారు. దానితో రెగ్యులర్ మూవీ కాకుండా ఏదైనా డిఫరెంట్ మూవీ చేయాలి అని విరు అనుకున్నారు. అందులో భాగంగా వజ్రాల నిధి కోసం వెతికే కాన్సెప్ట్ తో ఒక కథను రెడీ చేశారు. అలాగే మూవీ షూటింగ్ను కూడా మొదలుపెట్టారు. కాకపోతే సినిమాలో ఏదో తేడా కొడుతుంది. అని మూవీ బృందం అంతా భావించారు. దానితో వెంటనే సినిమా షూటింగ్ను నిలిపివేసి ఇది కాదు వేరే ఏదైనా ఆలోచించాలి అని మళ్లీ ఆలోచనలను మొదలుపెట్టారు.

అందులో భాగంగా యండమూరి రవీంద్రనాథ్ అందించిన కథ బాగా నచ్చడంతో ఈ కథతో మూవీ చేద్దాం అని మూవీ బృందం ప్రొసీడ్ అయ్యింది. అదే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ. అలా యండమూరి రవీంద్రనాథ్ ఇచ్చిన కథతో ఈ మూవీ షూటింగ్ మొదలు అయింది. సినిమా ప్రారంభం అయినప్పటినుండి జనాల్లో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా 1990 మే 9 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా ఆ కాలంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా 33 సంవత్సరాల పూర్తి చేసుకుంది.

Visitors Are Also Reading