Home » జబర్దస్త్ ను బ్రతికించిన గెటప్ శ్రీను..!

జబర్దస్త్ ను బ్రతికించిన గెటప్ శ్రీను..!

by Azhar
Ad

బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన కార్యక్రమం జబర్దస్త్. ఈ షో వల్ల చాల మంది ప్రజలకు పరిచయం అయ్యారు. అలాగే ఈ షో పేరుతోనే ఎంతో మంది జీవితంలో బాగా స్థిరపడ్డారు. అలాగే ఇంకొందరు ఈ జబర్దస్త్ ద్వారా సినిమాల్లో అవకాశాలు అనేవి తెచ్చుకొని.. ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్స్ గా రాణిస్తున్నారు. అయితే ఈ షోలో పేరు అనేది తెచ్చుకున్నా వారిలో గెటప్ శ్రీను ఒక్కడు.

Advertisement

అయితే ఈ షోలో వేసే వింత వింత గెటప్స్ కారణంగా ఆయనను గెటప్ శ్రీను అని పిలుస్తుంటారు. ఇక జబర్దస్త్ లోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్యే రోజా ఆ షో నుండి వెళ్లిపోయిన తర్వాత గెటప్ శ్రీను, సుధీర్ కూడా ఈ షో నుండి వెళ్లిపోయారు. ఇక ఎలా అందరూ ఒక్కేసారి వెళ్లిపోవడంతో జబర్దస్త్ రేటింగ్స్ అనేవి పడిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ గెటప్ శ్రీను జబర్దస్త్ లోకి వచ్చాడు.

Advertisement

రెండు వారాల క్రితం ఈ షోకి మళ్ళీ వచ్చిన గెటప్ శ్రీను తనతో పాటె రేటింగ్స్ కూడా తెచ్చాడు. అప్పటివరకు ఇక జబర్దస్త్ పని అనేది అయ్యిపోయింది అని.. ఇక ఇది బంద్ అవుతుంది అనే కామెంట్స్ వచ్చాయి. కానీ గెటప్ శ్రీను వచ్చిన తర్వాత నుండి అవి బంద్ అయ్యాయి. ఎందుకంటే… గెటప్ శ్రీను వచ్చిన తర్వాత జబర్దస్త్ యొక్క రెటైన్స్ అలాగే వ్యూస్ అనేవి పెరిగాయి. అలా శ్రీను జబర్దస్త్ ను బ్రతికించినట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి :

తన సక్సెస్ పై దినేష్ కామెంట్స్..!

బంగారు పోరులోకి భారత్..!

Visitors Are Also Reading