Home » నా ప్రాణం పోయే వ‌ర‌కు నా హృద‌యంలో నువ్వే ఉంటావు అంటున్న వ‌ర్ష‌.. ఇమ్మూ రియాక్ష‌న్ ఏమిటంటే..?

నా ప్రాణం పోయే వ‌ర‌కు నా హృద‌యంలో నువ్వే ఉంటావు అంటున్న వ‌ర్ష‌.. ఇమ్మూ రియాక్ష‌న్ ఏమిటంటే..?

by Anji

జ‌బ‌ర్ద‌స్త్ షోకీ బ్యూటీ క్వీన్ గా మారిపోయింది వ‌ర్ష‌. యాంక‌ర్స్ ర‌ష్మి, అన‌సూయ‌ను కూడా మించిపోయిన‌ది. స్టేజ్ మీద రెచ్చిపోతోంది. ఇటీవల త‌న మ‌న‌స్సులో మాట‌ను కో ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్‌కు చెప్పేసింది.

జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ మీద ఎప్ప‌టి నుంచో ల‌వ్ ట్రాక్‌లు వ‌ర్కౌట్ అవుతూనే ఉన్నాయి. ర‌ష్మి-సుధీర్‌ల జంట‌తో మొద‌లై.. అలా కొత్త జంట‌లు పెరుగుతూనే ఉన్నారు. అయితే స్క్రీన్ ర‌ష్మి-సుధీర్ ల జంట‌తో మొద‌లై అలా కొత్త జంట‌లు పెరుగూతూనే ఉన్నారు. అయితే స్క్రీన్ మీద ర‌ష్మి-సుధీర్ త‌రువాత బాగా వ‌ర్కౌట్ అయిన హిట్ ఫెయిర్ మాత్రం వ‌ర్ష ఇమ్మాన్యుయేల్ జంట‌నే.

Also Read :  IPL 2022 : జ‌ట్టు పేరు, కెప్టెన్‌ను ప్ర‌క‌టించిన అహ్మ‌దాబాద్‌

ప్ర‌తి ఎపిసోడ్‌లో ఏదో ఒక స్పెష‌ల్ చూపిస్తారు వీరిద్ద‌రూ. గ్లామ‌ర్ ప‌రంగా ఇద్ద‌రికీ చాలా డిఫ‌రెన్స్ ఉన్నా.. హిట్ ఫెయిర్‌గా జ‌బ‌ర్ద‌స్త్‌లో టాప్ పొజిష‌న్స్‌లో ఉన్నారు వీరిద్ద‌రూ. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య అప్పుడ‌ప్పుడూ జ‌రిగే ఫ‌న్ని స్క్రిట్స్‌, రొమాన్స్, షో రేటింగ్ అమాంతం పెంచేస్తున్న‌ది. దీంతో వీరు ఫ‌ర్పామెన్స్ రెచ్చిపోయి ఇస్తుంటారు. ఇటీవ‌ల ఇమ్మూకీ డైరెక్ట్‌గా ప్ర‌పోజ్ చేసింది వ‌ర్ష‌. నా ప్రాణం పోయే వ‌ర‌కు నా హృద‌యంలో నువ్వుంటావంటూ హార్ట్ సింబ‌ల్‌తో ఇమ్మాన్యుయేల్‌కు ప్ర‌పోజ్ చేసింది. నువ్వంటే ఎంతో స్పెష‌ల్ అంటూ వ‌ర్ష ప్ర‌పోజ్ చేయ‌డంతో దిల్ ఖుష్ అయ్యాడు ఇమ్మాన్యూయేల్‌.

ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌లో వ‌ర్ష‌-ఇమ్మాన్యుయేట్ జంట‌కు భారీగా ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్క్రీన్ మీద వీరిద్ద‌రి పెయిర్ కోసం ఎదురు చూస్తుంటారు జ‌నాలు. వీరి మ‌ధ్య స‌గే ఫ‌న్నీ సీన్స్‌.. టైమింగ్ ప్ర‌కారం.. ప‌డే పంచులంటే ప‌డిచ‌స్తుంటారు ఆడియ‌న్స్‌. ముఖ్యంగా వ‌ర్ష జ‌బ‌ర్ద‌స్త్ యువ‌రాణిలా మారిపోయింది. ఇద్ద‌రూ యాంక‌ర్స్ ఉన్నా.. వారిని మించిపోయిన బ్యూటితో ఆక‌ట్టుకుంటుంది వ‌ర్ష‌. స‌న్న‌గా మ‌ల్లె తీగ‌లా ఉండే ఈ బ్యూటీ. జ‌బ‌ర్ద‌స్త్ షో చేసుకుంటూనే అటు సినిమా ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోష‌ల్ మీడియాలో అద‌ర‌కొడుగుతుంది.

జ‌బ‌ర్ద‌స్త్ లోనే కాకుండా సోష‌ల్ మీడియా ప‌రంగా కూడా వ‌ర్ష‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వర్ష ఫొటో షూట్ కోసం ఎదురుచూస్తే ఫ్యాస్ కూడా చాలా మంది ఉన్నారు. ఇటు జ‌బ‌ర్ద‌స్త్ షోకి.. అటు సోష‌ల్ మీడియా ఫోజుల‌కు వ‌రుస‌బెట్టి కామెంట్స్ చేస్తుంటారు ఫ్యాన్స్‌.

Also Read :  వాల్తేరు శ్రీ‌ను ఫ‌స్ట్ లుక్ ఎలా ఉందో తెలుసా..?

Visitors Are Also Reading