జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్ లు పరిచయం అయ్యారు. ప్రస్తుతం వాళ్లంతా ఫుల్ బిజీగా ఉంటున్నారు. టీవీషోలు ఇతర ఈవెంట్ లతో గ్యాప్ లేకుండా గడుపుతున్నారు. అయితే జబర్దస్త్ లో కమెడియన్ లుగా రాణిస్తున్న చాలా మంది ఒకప్పుడు కెరీర్ లో ఎన్నో కష్టాలుపడినవాళ్లే. ఎవరిని కదిలించినా కష్టాల కథలే వినిపిస్తుంటాయి. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నవాళ్లలో శాంతి స్వరూప్ కూడా ఒకరు.
Advertisement
లేడీ గెటప్ లు వేస్తూ శాంతి స్వరూప్ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదట్లో చంటి, చంద్ర స్కిట్ లలో కనిపించిన శాంతి స్వరూప్ ఆ తరవాత హైపర్ ఆది స్కిట్స్ లో కూడా నటించాడు. ప్రస్తుతం శాంతి స్వరూప్ సినిమాలతో పాటూ ఇతర టీవీ షోలలోనూ సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోకు శాంతిస్వరూప్ గెస్ట్ గా వచ్చాడు.
Advertisement
అంతే కాకుండా ఈ సారి శాంతి స్వరూప్ తన తల్లితో కలిసి క్యాష్ షోలో పాల్గొన్నాడు. కాగా షోలో శాంతి స్వరూప్ ఓపెన్ అయ్యాడు. తన తల్లి సరోజనమ్మ పడిన కష్టాల గురించి చెబుతూ శాంతి స్వరూప్ ఎమోషనల్ అయ్యాడు. తన చిన్నతనం లో తన తల్లి ఇంటింటికి వెళ్లి పాచి పనులు చేసేదని చెప్పాడు. అంట్లు తోమి తనను పెంచిపోషించిందని అన్నాడు. తన తల్లి చాలా ఇండ్లల్లో పాచి పనులు చేసేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ సమయంలో ఎన్నో ఆకలి బాధలను అనుభవించామని చెప్పాడు. తన తల్లి గొంతు సరిగా లేదని ఆమె సరిగా మాట్లాడలేదని చెప్పాడు. ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేదని ఎమోషనల్ అయ్యాడు. దాంతో శాంతి స్వరూప్ తల్లికూడా కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకు తనను బ్రతికిస్తున్నాడని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.