బుల్లితెర పైన జబర్దస్త్ కు ఓ ప్రత్యేక స్థానం అనేది అందరికీ తెలిసిందే. దాదాపు 8 ఏళ్లుగా విజయవంతంగా సాగుతున్న ఈ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. అలాగే చాలామంది కమెడియన్లను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇది ఇలా ఉంటే, ఈ కార్యక్రమంలో చాలా జంటలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ షోలో మొదట కేవలం సుధీర్, రష్మీ జంట మాత్రమే ఉండేది. ఆ జంట చాలా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత చాలా రోజులకు వచ్చిన ఇమాన్యుయల్, వర్ష జంట కూడా అభిమానులకు నచ్చడంతో వరుస పెట్టి జంటలు పుట్టుకొచ్చాయి.
Advertisement
అందులోనే రాకింగ్ రాకేష్, సుజాత జంట కూడా ఒకటి. ఇదంతా పక్కకు పెడితే, తాజాగా జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకోగా, తాజాగా పెళ్లి కూడా చేసేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు, జబర్దస్త్ కమెడియన్ల సమక్షంలోనే జరిగినట్లుగా సమాచారం. ఈ వేడుక తిరుపతిలో జరిగినట్టు తెలుస్తోంది.
దాదాపుగా 20 ఏళ్ల క్రితమే హైదరాబాదుకు వచ్చిన రాకేష్ మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించారు. చాలా చోట్ల షోలు చేసి మంచి పాపులారిటీ అందుకున్న రాకేష్, ధనరాజు టీం లో ఒక కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కిరాక్ ఆర్పి, రాకింగ్ రాకేష్ పేరుతో టీం కూడా లీడ్ చేశారు. ఇక ఆర్పి వెళ్లిపోవడంతో సింగిల్ గా టీం లీడర్ గా మారిపోయారు. ఇక సుజాత కూడా బిగ్ బాస్ లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించింది.
READ ALSO : ఆస్పత్రి బెడ్ పైనే వధువుకు తాళి కట్టిన వరుడు..వీడియో వైరల్