Home » జబర్దస్త్ నూకరాజు పెళ్లి.. కానీ అడ్డు చెప్పిన తల్లి.. అసలు కారణం తెలిస్తే..!!

జబర్దస్త్ నూకరాజు పెళ్లి.. కానీ అడ్డు చెప్పిన తల్లి.. అసలు కారణం తెలిస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ ఎంతటి గుర్తింపు పొందిందో మనందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా టీవీ ప్రేక్షకులను అభిమానులను నవ్విస్తున్న ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు మంచి కెరీర్ ని పొందారని చెప్పవచ్చు.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుధీర్ హైపర్ ఆది,గెటప్ శ్రీను తదితర కమెడియన్లు ఉన్నారు. ఇక జబర్దస్త్ షోలో ముఖ్యంగా జోడీలు చాలా ఫేమస్ అయ్యాయి. సుధీర్ రష్మీ జోడి అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఈ విధంగా నూకరాజు ఆసియా జోడి కూడా చాలా ఫేమస్ అయ్యారు. పటాస్ కామెడీ షో ద్వారా ఎంతో ఫేమస్ అయిన నూకరాజు తనదైన కామెడీతో అందరిని నవ్విస్తాడు.

Advertisement

ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతూ ఇదే షోలో చేస్తున్న ఆసియాతో లవ్ లో పడ్డాడు. వీరిద్దరు జోడిగా చాలా స్కిట్లు చేశారు. వీరిద్దరూ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.. ఈ తరుణంలోనే తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్లో నూకరాజు తల్లిదండ్రులు భాగమయ్యారు. ఇందులో నూకరాజు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెన్స్ ని స్కిట్ గా చేసినట్టు సమాచారం.

Advertisement

ఈ స్కిట్ పూర్తయిన తర్వాత ఇంద్రజ జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలో.. నూకరాజు తల్లి ఆసియాతో పెళ్లికి అడ్డు చెప్పింది. మేడం ఇది స్కిట్ వరకే అన్నారు. నిజంగా అయితే కుదరదు మేడం అని బాంబు పేల్చింది. దీంతో ఆసియా షాక్ కు గురైంది. ఒక్కసారిగా అంతా నివ్వెర పోయారు. ఈ ప్రోమో చూస్తే మాత్రం వీరి లవ్ మ్యాటర్ గురించి తీసుకురావడం , నూకరాజు తల్లి నో చెప్పడం చూస్తుంటే ఇదంతా హైప్ కోసమే చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై మీ కామెంట్లు ఏంటో చెప్పండి..

also read:వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?

Visitors Are Also Reading