Home » జ‌బ‌ర్దస్త్ లో అనసూయ ప్లేస్ వ‌చ్చింది ఆవిడేనా?

జ‌బ‌ర్దస్త్ లో అనసూయ ప్లేస్ వ‌చ్చింది ఆవిడేనా?

by AJAY
Published: Last Updated on
Ad

ఒక టీవీ షో స‌క్సెస్ అవ్వాలంటే ముందుగా ఆ షో కాన్సెప్ట్ తో పాటూ యాంక‌ర్ బాగుండాలి. మంచి వాక్చాతుర్యంతో పాటూ గ్లామ‌ర్ కూడా ఉండాలి. అలా ఉంటేనే ఆ షోకు అందం వ‌స్తుంది. ఇక అలా జ‌బ‌ర్ద‌స్త్ షోకు అందం తీసుకువ‌చ్చిన యాంక‌ర్ అన‌సూయ‌. జ‌బ‌ర్దస్త్ షోలో కామెడీ తో పాటూ అన‌సూయ గ్లామ‌ర్ కూడా తోడ‌వ‌డం వ‌ల్లే అంతపెద్ద స‌క్సెస్ అయ్యింది అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

Advertisement

ఈ షోతో అన‌సూయ కు కూడా ఎంతో పేరు వ‌చ్చింది. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ అంటూ అన‌సూయ‌ను పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. పొట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో అన‌సూయ షోలో సంద‌డి చేయ‌డంతో ఆ బ్యూటీ కోసమే షో చూసే ప్రేక్ష‌కులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ షోతో వ‌చ్చిన పాపులారిటీతో అన‌సూయ ప్ర‌స్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా మారిపోయింది. గ్యాప్ లేకుండా సినిమాలు ఇత‌ర టీవీ షోలు చేస్తోంది.

anasuya darja

Advertisement

అయితే ఇప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్ షోను చాలా మంది వ‌దిలివెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పుడు అన‌సూయ కూడా జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పేసిన‌ట్టే క‌నిపిస్తుంది. రీసెంట్ గా విడుద‌ల చేసిన జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో అన‌సూయ‌కు గుడ్ బై చెప్పి కొత్త యాంక‌ర్ కు వెల్ క‌మ్ చెప్పారు. అయితే ఈ ప్రోమోలో కొత్త యాంక‌ర్ ను ప‌ల్లకిలో తీసుకువ‌చ్చారు కానీ ఆమె ముఖాన్ని మాత్రం చూపించ‌లేదు.

అయితే ఆ యాంక‌ర్ మ‌రెవ‌రో కాదు యాంక‌ర్ మంజూష అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక మంజూష‌కు సైతం అన‌సూయ మాధిరిగానే యూత్ లో తెగ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోనూ మంజూష‌కు ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్లామ‌ర్ డోస్ ఏ మాత్రం త‌గ్గ‌కుండా మ‌ల్లెమాల టీమ్ మంజూష‌ను రంగంలోకి దింపిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

ALSO READ : రీల్ లైఫ్ కాదు నాగార్జున రియల్ లైఫ్ కింగ్…ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా….?

Visitors Are Also Reading