Home » జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్‌కు ప్ర‌మాదం.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్‌కు ప్ర‌మాదం.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

by Anji

ఈటీవీ లో వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ ఖ‌త‌ర్నాక్ కామెడీ షో ఎంత ఫేమ‌స్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ షో గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఈ షోలో మోస్ట్ పాపుల‌ర్ క‌మెడీయ‌న్ న‌రేష్ వేసే పంచ్‌ల‌కు అత‌ని కామెడీ టైమింగ్ మంచి క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిన‌దే. చూడ‌డానికి చాలా చిన్న‌గా ఉన్నా.. అత‌ను పేల్చే కామెడీ పంచ్‌లు మాత్రం బుల్లెట్‌లా దిగుతుంటాయి. తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ ప్ర‌మాదానికి గురైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read :  దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మృతిపై.. డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ కీల‌క విష‌యాలు వెల్ల‌డి..!

ఈటీవీలో సుమ క‌న‌కాల యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ప్రోగ్రామ్ క్యాష్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తి శ‌నివారం ప‌లు సెలబ్రిటీలు ఈ ప్రోగ్రామ్‌కు అతిథులుగా వ‌చ్చి సంద‌డి చేస్తుంటారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒక‌టి విడుద‌ల అయింది. ఈ ప్రోమోలో భాగంగా నాలుగు జంట‌లు అతిథులుగా వ‌చ్చాయి. ఒక టాస్క్‌లోని త‌మ జంట‌గా వ‌చ్చిన వారికి ప్ర‌పోజ్ చేయాలి. అయితే జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ మాత్రం యాంక‌ర్ సుమకు ప్రపోజ్ చేస్తాడు. దీనికి సుమ ఒప్పుకోలేదు.

ప్రోమో చివ‌రిలో మాత్రం మీరు ఒప్పుకోక‌పోతే నేను కిందికి దూకేస్తా అంటూ స్టేజీ చివ‌రికీ వెళ్లి బెదిరిస్తాడు. అలా ఓ సారి కాలు జారి కిందికి ప‌డిపోతాడు. ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో యాంక‌ర్ సుమాతో పాటు అంద‌రూ షాక్‌కు గుర‌వుతారు. ఆ త‌రువాత అంబులెన్స్ వ‌చ్చిన‌ట్టు సౌండ్ కూడా వినిపిస్తోంది. కేవ‌లం ఇది ప్రోమో కోస‌మే అలా చేశారా..? లేక వాస్త‌వంగా ఈ ప్ర‌మాదం జ‌రిగిందా అనేది మాత్రం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే..!

Visitors Are Also Reading