Home » Hyper Aadi : మిలియ‌న్‌ల నుంచి ల‌క్ష‌ల‌కు ప‌డిపోయిన హైప‌ర్ ఆది.. స్కిట్ నుంచి తొల‌గిస్తారా..?

Hyper Aadi : మిలియ‌న్‌ల నుంచి ల‌క్ష‌ల‌కు ప‌డిపోయిన హైప‌ర్ ఆది.. స్కిట్ నుంచి తొల‌గిస్తారా..?

by Anji
Ad

ఈటీవీలో ప్రసారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోకు ఎంత మంది అభిమానులు ఉన్నారో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ షో ప్రారంభ‌మై ప‌ది సంవ‌త్స‌రాలు అయిందంటే ఎవరూ న‌మ్మ‌డం లేదు. ప‌ది సంవ‌త్స‌రాల నుంచి ఈ షో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూనే ఉంది. అద్భుత‌మైన కామెడీ షోగా పేరు ద‌క్కించుకున్నది. ఈటీవీకి రికార్డు స్థాయి రేటింగ్‌ను సంపాదించి పెట్టిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌ల్లెమాల వారికి జ‌బ‌ర్ద‌స్త్ ఓ రేంజ్ గుర్తింపును తెచ్చిపెట్టింది. గ‌త కొంత కాలంగా జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌ల‌ను త‌న భుజాల‌పై వేసుకుని మోస్తున్నాడు హైప‌ర్ ఆది.

Also Read :  రాధేశ్యామ్ ట్రైల‌ర్ లో చూపించి సినిమాలో లేపేసిన సీన్లు ఇవే…!

Advertisement

Advertisement

ముఖ్యంగా కొంత కాలం ముందు వ‌ర‌కు జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్లలో మిలియ‌న్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నారు హైప‌ర్ ఆది. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో అత‌ని కామెడీ స్కిట్లు అంత‌గా వెళ్ల‌డం లేదు. ఒక‌టి రెండు త‌ప్ప ఏ ఒక్క‌టి కూడా మిలియ‌న్ల కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకోలేక పోతున్నాయి. చాలా వ‌ర‌కు ల‌క్ష‌ల్లోనే ఆయ‌న స్కిట్స్‌కు సంబంధించిన వ్యూస్ వ‌స్తున్నాయి. ఆదిలో తొలుత క‌నిపించిన ఫైర్ లేదు అంటున్నారు. అత‌ని నుంచి ఓ రేంజ్ కామెడీ ఆశిస్తున్న ప్రేక్ష‌కుల‌కు నిరాశ త‌ప్ప‌డం లేదు. ఆది నుంచి మంచి కామెడీ అని కాకుండా కింద‌ప‌డే స్థాయి పంచ్‌ల కోసం ప్రేక్ష‌కులు ఆశిస్తారు.

ఆది స్కిట్ నుంచి ప్రేక్ష‌కులు ఆశిస్తున్న స్థాయిలో ఈ మ‌ధ్‌య పంచ్‌లు పేల‌డం లేదు. ఆయ‌న వేసే పంచ్‌ల కంటే జ‌డ్జీలు వేసే పంచ్ డైలాగ్‌లు చాలా బాగుంటున్నాయి. అప్పుడ‌ప్పుడూ మాత్ర‌మే ఆది ఆక‌ట్టుకుంటున్నాడ‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. గ‌త వారం ఆయ‌న చేసిన స్కిట్స్‌కు వ‌చ్చిన వ్యూస్ ఆయ‌న స్థాయిలో దారుణంగా ప‌డిపోయింద‌ని ఇట్టే అర్థ‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితినే కొన‌సాగితే హైప‌ర్ ఆదిని టీమ్ నుంచి త‌ప్పిస్తారేమో అని బుల్లి తెర వ‌ర్గాల‌లో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రొక వైపు సుడిగాలి సుధీర్ టీమ్ జోరు కొన‌సాగుతుంది.

Also Read :  మంచు విష్ణు సినిమా నుంచి సాయి ప‌ల్లవి త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading