Home » కొత్త కారు కొన్న జబర్దస్త్ శాంతిస్వరూప్.. దాని గురించి ఏమ‌న్నారంటే..?

కొత్త కారు కొన్న జబర్దస్త్ శాంతిస్వరూప్.. దాని గురించి ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒక్క కామెడీ షో ఎంత పాపులారీటీ సంపాదించుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ కామెడీ షో ఎంతో అప్‌క‌మింగ్ క‌మెడీయ‌న్ల‌కు లైఫ్ ఇచ్చింది. ఈ షో ప్రారంభ‌మై ఇప్ప‌టికీ ఎనిమిదేళ్లు పూర్త‌యినా ఇంకా స‌క్సెస్‌పుల్‌గా మంచి టీఆర్‌పీ తో కొన‌సాగుతుంది. దీనివ‌ల్లే చాలా మంది క‌మెడీయ‌న్లు స్టార్ల‌య్యారు. అలా జ‌బ‌ర్ద‌స్త్ వ‌ల్ల ఫేమ్ సంపాదించుకున్న వారిలో శాంతి స్వ‌రూప్ కూడా ఒక‌రు. హైప‌ర్ ఆది స్కిట్‌ల‌లో లేడీ గెట‌ప్‌లు వేసేశాంతి స్వ‌రూప్ త‌న కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇటీవ‌లే శాంతి స్వ‌రూప్ ఓ కారును కొనుగోలు చేశారు.

Also Read : జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..?

Advertisement

Advertisement


శాంతి స్వ‌రూప్ త‌న‌తో వ‌ర్క్ చేసిన లేడీ గెట‌ప్‌లు వేసిన కొంతమంది త‌న స్నేహితులు త‌న‌ను అవ‌మాన ప‌రిచారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. తాను గ‌తంలో నా క‌ల‌ల కారంటూ యూట్యూబ్‌లో ఓ వీడియోను పెట్టాన‌ని శాంతి స్వ‌రూప్ పేర్కొన్నారు. ఆ వీడియోను డిలీట్ చేశాన‌ని దానికి కార‌ణం ఇప్పుడు చెబుతాన‌ని పేర్కొన్నారు. ఆ కారు త‌న కారు కాద‌ని షూటింగ్ జ‌రుగుతుండ‌గా అక్క‌డ ఒక ఆర్ క‌నిపిస్తే ప్రేక్ష‌కుల రెస్పాన్స్ ఎలా ఉంటుందోన‌ని త‌న కారు అన్న‌ట్టుగా వీడియో తీశాన‌ని శాంతి స్వ‌రూప్ చెప్పుకొచ్చారు. ఆ వీడియో త‌రువాత త‌న‌కు చాలా మంది ప్రేక్ష‌కులు కంగ్రాట్స్ చెప్పారు అని.. కొంత మంది త‌న‌తో వ‌ర్క్ చేసేవాళ్లు లేడీ గెట‌ప్‌లు వేసే వాళ్లు అవ‌మానించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అసలు కారును తాకే అర్హ‌త నీకుందా అని త‌న‌ను దారుణంగా అవ‌మానించార‌ని శాంతి స్వ‌రూప్ వెల్ల‌డించారు.

తాను కారును కొన‌బోతున్నా అని, మాట్లాడే సంద‌ర్భం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. మీ మాదిరిగా అడ్డ‌దారుల్లో నేను డ‌బ్బు సంపాదించ‌లేద‌ని, బంగారం న‌గలు కొనుక్కోలేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను కూడా చెడ్డ ప‌నులు చేస్తే ఒక్క రాత్రిలో కార్లు, విల్లాలు కొన‌గ‌ల‌ను కానీ నేను అలాంటి త‌ప్పులు చేయ‌ను అని చెప్పారు. త‌న‌ను కించ‌ప‌రిచిన వారికి ముఖ్యంగా చెబుతున్నా మీ ద‌గ్గ‌ర ఉంటే మీ ద‌గ్గ‌రే పెట్టుకోండి. కానీ ఇత‌రుల‌ను కించ‌ప‌ర‌చ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.

Also Read :  డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలలో నటించారని మీకు తెలుసా ?

Visitors Are Also Reading