జబర్దస్త్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క బ్రాండ్ అనే విషయం తెలిసిందే. 2013 లో ఈ షో అనేది ప్రారంభమైన సమయం నుండి ఇప్పటివరకు కూడా జబర్దస్త్ చాలా సక్సెస్ గా నెడుతుంది అనే చెప్పాలి. అయితే ఈ షో సక్సెస్ లో అందరితో పాటుగా దీనిని హోస్ట్ గా వ్యవహరించిన అనసూయ కూడా కారణం అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అనసూయ ఈ షోను వదిలేసింది.
తన ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అనేవి వస్తున్నాయి అని చెప్పిన అనసూయ ఈ షోను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు కూడా దీనికి కొత్త యాంకర్ ఎవరు అనే ప్రశ్న అందర్నీ వెంటాడుతుంది. అయితే ఆ కొత్త యాంకర్ ఈరోజు వచ్చే ఎపిసోడ్ లో వస్తుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే నేటి ఎపిసోడ్ యొక్క ప్రోమో అనేది వారు విడుదల చేయలేదు.
అందువల్ల కొత్త యాంకర్ ఈరోజు రావడం పక్క అంటున్నారు. కానీ ఎవరు అనేది తెలియకపోయిన.. ఆ యాంకర్ యొక్క రెమ్యునరేషన్ అనేది బయటకు వచ్చింది. ఈ కొత్త యాంకర్ కు ఎపిసోడ్ కు రెండు లక్షల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది గత యాంకర్ అనసూయ కంటే తక్కువే. అనసూయకు ఒక్కో ఎపిసోడ్ కు కనీసం మూడు లక్షల వరకు ఇచ్చేవారు అనేది తెలిసిన విషయమే.
ఇవి కూడా చదవండి :