Telugu News » పూర్ణ నా లవర్ అంటూ జబర్దస్త్ నరేష్ సంచలనం….ఆ ఫోటోలు బయట పెట్టడం తో అంతా షాక్…!

పూర్ణ నా లవర్ అంటూ జబర్దస్త్ నరేష్ సంచలనం….ఆ ఫోటోలు బయట పెట్టడం తో అంతా షాక్…!

by AJAY MADDIBOINA

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నరేష్ కూడా ఒకరు. నరేష్ చూడడానికి చిన్న పిల్లవాడు గా కనిపించినా అతడి వయసు పాతికేళ్ల పైనే ఉంటుంది. మొదట్లో బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో చేసిన నరేష్ ప్రస్తుతం సొంతంగా మరియు ఇతరుల టీమ్ లలోనూ చేస్తున్నాడు. అంతేకాకుండా తనదైన కామెడీ స్టైల్, పంచులతో నరేష్ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. దాంతో నరేష్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

Ads

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకర్ రష్మీ, జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో ఆ స్థానం లోకి పూర్ణ మరియు నటి ఇంద్రజ వచ్చారు. అయితే తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్ లో నరేష్ షాకింగ్ కామెంట్ లు చేశాడు. కెవ్వు కార్తిక్ తో కలిసి స్కిట్ చేసిన నరేష్ స్కిట్ లో… నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాడు.

కానీ కార్తీక్ నమ్మకపోవడం తో గర్ల్ ఫ్రెండ్ మరెవరో కాదు ఈ షోకు జడ్జీగా వచ్చిన పూర్ణ అంటూ నరేష్ షాకిచ్చాడు. ఇక కార్తీక్ పూర్ణా నా లవర్ అంటే సరిపోతుందా..? నువ్వు చెబితే ఎవరు నమ్మరు అని అంటాడు. దానికి నరేష్ మీరు అలా నమ్మరు అనే నేను సాక్షాలతో వచ్చానని చెప్పాడు.

అనంతరం రాధే శ్యామ్ సినిమాలోని ట్రైన్ సీన్ పోస్టర్ లో ప్రభాస్ కు తన ముఖాన్ని పూజా హెగ్డే ముఖం స్థానంలో పూర్ణ ముఖాన్ని ఎడిట్ చేశాడు. అదేవిధంగా బాహుబలి సినిమా పోస్టర్ లో సైతం ప్రభాస్ స్థానం లో తన ఫోటోను తమన్నా స్థానంలో పూర్ణ ఫోటోలు పెట్టి ఎడిట్ చేశారు. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ స్కిట్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also read :

బాలయ్య కూతురు పెళ్లిలో ఎన్టీఆర్ ను అంతలా అవమానించారా…? అసలేం జరిగిందంటే..!


You may also like