Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » జబర్దస్త్, ఢీ నుంచి సుధీర్ అవుట్… వై ?

జబర్దస్త్, ఢీ నుంచి సుధీర్ అవుట్… వై ?

by Bunty
Ads

బుల్లితెర కామెడీ షో ప్రియులకు షాక్… సుడిగాలి సుధీర్‌ టీమ్ ఇకపై షోలో కనిపించదని ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ హాస్య నటుడు సుడిగాలి సుధీర్‌కు తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను తన కామెడీ టైమింగ్, హార్డ్ వర్క్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. జబర్దస్త్ షోలో బెస్ట్ కమెడియన్స్‌లో ఒకడు అని, షోకి మంచి టీఆర్‌పీ రావడానికి ఆయనే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ త్వరలో జబర్దస్త్ షోకి వీడ్కోలు పలుకబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇతర షోలు, సినిమా షూటింగుల్లో చాలా బిజీగా ఉండడంతో సుధీర్ మల్లెమాల టీవీతో వచ్చే ఏడాది ఒప్పందంపై సంతకం చేయలేదని చెప్పుకొచ్చారు. అలాగే సుధీర్‌తో పాటు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా షో నుండి తప్పుకుంటారని అంటున్నారు.

Advertisement

Advertisement

dhee champions latest promo: Sudigali Sudheer: కమెడియన్ నుండి జడ్జ్ రేంజ్‌కి సుడిగాలి సుధీర్..!? - funny skit in sudigali sudheer from comedian to judge range | Samayam Telugu

Ad

ఇక తాజాగా సుధీర్ మావో బుల్లితెర షో ‘ఢీ’ని కూడా వీడినట్లు కన్పిస్తోంది. తాజాగా విడుదలైన ఈ డ్యాన్స్ షోకు సంబంధించిన ప్రోమోలో సుధీర్ కన్పించలేదు. పైగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ కూడా కన్పించాడు. అయితే సుధీర్‌ బయటకు వస్తే అతను లేని జబర్దస్త్ ని, ఢీని ఊహించడం చాలా కష్టం. అయితే ఈ వార్తలపై వారు ఇప్పటి వరకూ స్పందించలేదు. ఈ రెండు షోల ద్వారానే సుధీర్, యాంకర్ రష్మీ ట్రాక్ కూడా హిట్ అయ్యింది.  మరి ఈ వార్తలపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.

Visitors Are Also Reading