Home » నేను ఎమ్మెల్యే అవుతా అసెంబ్లీకి వెళతా….అనసూయ కామెంట్స్….!

నేను ఎమ్మెల్యే అవుతా అసెంబ్లీకి వెళతా….అనసూయ కామెంట్స్….!

by AJAY
Ad

తెలుగులో ఇప్పటివరకు ఎన్నో కామెడీ షోలు వచ్చిన జబర్దస్త్ కామెడీ షోను కొట్టే షో రాలేదనే చెప్పాలి. కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ టిఆర్పి తో జబర్దస్త్ కొనసాగుతోంది. ఈ షో సక్సెస్ లో కమెడియన్లు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారో యాంకర్ అనసూయ, జడ్జీలుగా వ్యవహరించిన రోజా, నాగబాబు కూడా అంతే పాత్ర పోషించారు. అయితే నాగబాబు కొన్ని కారణాలవల్ల షో నుంచి పక్కకు తప్పుకున్నారు. దాంతో ఆయన ప్లేస్ లోకి సింగర్ మను రాగా రోజా ఆమె స్థానంలోనే కొనసాగుతున్నారు.

jabardasth anasuya

jabardasth anasuya

ఇక ఈ కామెడీ షోలో యాంకర్ అనసూయ కూడా స్కిట్ మధ్యలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. అంతేకాకుండా అనసూయ మీద వేసే పంచులే ఎపిసోడ్ కు హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక జబర్దస్త్ లో హైపర్ ఆది అనసూయ మధ్య జరిగే కామెడీ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది టైం చూసి అనసూయ పై పంచులు వేయడం ఆ పంచ్ లకు అక్కడున్న వాళ్లంతా నవ్వడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.

Advertisement

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కూడా హైపర్ ఆది అనసూయ పై పంచులు కురిపించాడు. ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను కూడా ఎమ్మెల్యే రోజా మాదిరిగా ఎమ్మెల్యే అయిపోతానని అసెంబ్లీ కి వెళ్తాను అని కామెంట్ చేసింది. దానికి ఆది సమాధానమిస్తూ నీకు ఫేస్ బుక్ లైవ్ లో ఉన్న సమస్య లే ఎక్కువ…. ఇంకా అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలు తీరుస్తావా అంటూ పంచ్ వేశాడు …. దాంతో అక్కడే కూర్చున్న రోజా నవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత అనసూయ ఆది ఇద్దరు కలిసి స్కిట్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఇక ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాలంటే ఫిబ్రవరి 3 వరకు ఆగాల్సిందే.

Visitors Are Also Reading