Home » కోవై స‌ర‌ళను చూస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే..?

కోవై స‌ర‌ళను చూస్తే ఆశ్చ‌ర్యపోవాల్సిందే..?

by Anji
Ad

కోవై స‌రళ పేరు వినగానే తెలుగు అభిమానుల‌కు ఆమె చేసే కామెడీనే గుర్తుకొస్తుంటుంది. ఆమె మాట ఆమె ముఖం క‌ళ్ల ముందే క‌ద‌లాడుతూ ఉంటుంది. లేడీ క‌మెడియ‌న్ గా ఆమెకు ఉన్న గుర్తింపు మ‌రెవ్వ‌రికీ లేదంటే ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. టాలీవుడ్‌లో కామెడీకి బ్ర‌హ్మంనందం కింగ్ అయితే.. క్వీన్ కోవై స‌ర‌ళ అనే చెప్ప‌వ‌చ్చు. ఇక గ‌త కొన్నేండ్లుగా ఆమె సినిమాల్లో క‌నిపించ‌డం లేదు.


2019లో వ‌చ్చిన అభినేత్రి-2 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించినా కోవై స‌ర‌ళ ఇన్నాళ్ల‌కు మ‌రొక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కోవై స‌ర‌ళ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం సెంబీ. అర‌ణ్య చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచితుడైన ప్ర‌భు సాల్మాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇవాళ విడుల చేసారు మేక‌ర్స్‌.

Advertisement

Advertisement


ఈ పోస్ట‌ర్‌లో కోవై స‌ర‌ళ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. ర‌ఫ్ లుక్‌లో త‌ల‌కు క్లాత్ క‌ట్టుకుని చిన్నారిని అక్కున చేర్చుకొని దీన స్థితిలో ఉన్న‌ట్టు క‌నిపించింది. అక‌స్మాత్తుగా చూస్తే ఈమె కోవై స‌ర‌ళ‌నేనా అనే అనుమానం వ‌స్తుంటుంది. ఓ బ‌స్ జ‌ర్నీ నేప‌థ్యంలో కొన‌సాగుతుంద‌ని.. కోవై స‌రళ చాలా సీరియ‌స్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో తంబీ రామ‌య్య‌, బాల‌న‌టి నీలా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌నుంది. చాలా రోజుల త‌రువాత రీ ఎంట్రీ ఇస్తున్న ఈ లేడీ కమెడీయ‌న్ ఈ సినిమాతో హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి మ‌రి.

Also Read : 

ఆ స్టార్ హీరో ని మించేలా ఎన్టీఆర్ సత్తాను చూపించబోతున్న డైరెక్టర్..!!

నేరేడుపండును వారు అస‌లు తిన‌కూడ‌ద‌ట‌..!

 

Visitors Are Also Reading