Home » ఆ బిగ్ బాస్ బామ‌తో నాగార్జున ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆ బిగ్ బాస్ బామ‌తో నాగార్జున ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు బిగ్ బాస్ వంటి టీవీ షోలో హోస్ట్ చేస్తున్న విష‌యం తెలిసిన‌దే. ఈ షో ద్వారా కొద్దిమంది త‌మ టాలెంట్ ను నిరూపించుకుంటుండ‌గా.. వారికి బంపర్ ఆఫ‌ర్ ఇస్తున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్‌-5లో సంద‌డి చేసిన ల‌హ‌రి ఉన్న‌న్ని రోజులు త‌న అందంతో పాటు ప్ర‌వ‌ర్త‌న‌తో కూడా ఆక‌ట్టుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు. బిగ్‌బాస్ కనిపించిన చాలా మంది వెండి తెర‌పై సంద‌డి చేయాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. ఇక ల‌హ‌రి మాత్రం వెండి తెర‌పై చాలా సినిమాల్లోనే క‌నిపించింది. బిగ్‌బాస్ త‌రువాత యాంక‌ర్‌గా మంచి పేరు ద‌క్కించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు ఇటీవ‌ల‌ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.


నాగార్జున బంగార్రాజు సినిమా ప్ర‌మోష‌న్ స‌మ‌యంలోనే ల‌హ‌రి ప‌లు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే నాగార్జున ల‌హ‌రికి ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. ఆ త‌రువాత కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఆమె నాగార్జున‌ను క‌లిసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డంలో నాగ్ ముందుంటాడన‌డంలో సందేహం లేదు. ఆమెకు మంచి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట నాగార్జున‌. అన్న‌పూర్ణ స్టూడియోలో ఓ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా నాగార్జున‌ను మ‌రొక‌సారి ల‌హ‌రి క‌లిసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.


మొత్తానికి నాగార్జున ఈ విధంగా ల‌హ‌రిని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడ‌ట‌. ఆమెతో ప్రాజెక్ట్ అంటే అది ఎలా ఉంటుందా అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నాగ్ సినిమాల విష‌యానికొస్తే ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు సినిమా విడుద‌లైంది. ఆ వెంట‌నే ది ఘోస్ట్ సినిమాను నాగ్ మొద‌లు పెట్టాడు. సినిమా క‌రోనా వ‌ల్ల కాస్త ఆల‌స్యంగా షూటింగ్ జ‌రుగుతుంది. త్వ‌రలోనే సినిమా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా ద‌ర్శ‌కుడు ప్ర‌వీన్ స‌త్తార్ ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ది ఘోస్ట్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ది ఘోస్ట్ కోసం అక్కినేని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : 

న‌మ్ర‌త గాసిప్స్ అస‌లు విన‌లేము.. చెవులు మూసుకుంటా అంటున్న మ‌హేష్‌బాబు..!

“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే…!

 

Visitors Are Also Reading