రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో భారత్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే కథానాయకుడు అని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండడంతో ప్రభాస్ నటించే సినిమాలు ఆస్థాయిలోనే రూపు దిద్దుకుంటున్నాయి. అదేవిధంగా 80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండవచ్చనేది ఒక అంచనా.. అయితే ప్రభాస్ తొలిమూవీ అయిన ఈశ్వర్‌కు అడికిచ్చిన రెమ్యూనరేషన్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
Advertisement
అది అంత పెద్ద మొత్తం అని కాదు. ఇంత తక్కువా అని. ఆ సినిమాలో హీరోయిన్‌తో పోల్చినా అది ఆయనకు తక్కువే కావడం విశేషం. ప్రభాస్‌ను వెండితెరకు పరిచయం చేసింది నిర్మాత, ప్రముఖ నటుడు కె.అశోక్‌కుమార్. మూవీ మేఘల్ గా పేరు ఉన్న డి.రామానాయుడు దగ్గర బంధువు. తెలుగు తెరపై ఎన్నో చిత్రాల్లో కథానాయుడిగా నటించి రెబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ జయంత్ సి. ఫరాన్జీ డైరెక్షన్‌లో ఈశ్వర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం విధితమే.
Advertisement
అతని పక్కనే ఫ్రెష్‌గా కనిపించేందుకు కొత్త హీరోయిన్ వేటలో పడిన నిర్మాత అశోక్‌కుమార్ చివరకు సీనియర్ నటులైన మంజుల-విజయ్‌కుమార్ తనయ శ్రీదేవి అయితే బాగుంటుందని సంప్రదిస్తే ఏకంగా రూ.20లక్షలు డిమాండ్ చేశారట. ప్రభాస్‌కు ఇస్తామని చెప్పిన పారితోషకానికి ఇది రెట్టింపు కావడం విశేషం. ఎంతకు కిందికి దిగిరాకపోవడంతో మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడిన అశోక్‌కుమార్ పరిస్థితిని ప్రభాస్‌కు వివరించారట.
Advertisement
హీరోయిన్ ఎక్కువగా పారితోషకం ఇస్తున్నందుకు ఏమనుకోవద్దు అని, సినిమా మంచి అవుట్ పుట్ రావడం కోసమే ప్రయత్నం అని డార్లింగ్ ప్రభాస్ ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని నవ్వుతూ ప్రొసిడ్ సర్ అని బదులిచ్చాడట. ఎలాంటి ఈగోలు పెట్టుకోని అతని ప్రవర్తన అప్పుడే కాదు ప్రస్తుతం ఉన్న స్థాయికి ఎదిగాక కూడా ఏ మాత్రం మారలేదు అన్నది అందరికీ తెలిసినదే. అందుకోసమేనేమో ఇండస్ట్రీలో అందరూ ఇష్టపడుతారు. అతని పక్కన నటించిన హీరోయిన్ రెండు, మూడు చిత్రాలకు పరిమితం కాగా.. ప్రభాస్ బాహుబలిగా ఎదగడం మరిపించే నిజమే అని చెప్పొచ్చు.