దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.
Advertisement
అద్భుత ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రధానంగా సీత పాత్రలో మృణాల్ తన పాత్రతో మెప్పించింది. ఇక ఈ సినిమాతో మృణాల్ టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అని నిపుణులు పేర్కొంటున్నారు.
సీతారామం సినిమాకే హైలెట్ గా నిలిచిన సీత పాత్ర కోసం తొలుత మృణాల్ ని అనుకోలేదట. సీత పాత్రలో మొదటగా పూజా హేగ్దేని అనుకున్నారట. కానీ కరోనా సమయంలో డేట్స్ సర్దలేక ఈ ప్రాజెక్ట్ కి పూజా హెగ్దే నో చెప్పినట్టు సమాచారం. ఈ పాత్ర నచ్చినప్పటికీ తప్పని పరిస్థితిలో పూజా ఈ చిత్రానికి నో చెప్పినట్టు తెలుస్తోంది. పూజా చేయాల్సిన ఈ సినిమా అవకాశాన్ని ఇలా మృణాల్ కొట్టేసిందన్న మాట.
Advertisement
ఒకవేళ ఈ చిత్రంలో పూజాహెగ్దే నటించినట్టయితే ఆ పాత్రకు మరింత వెయిటేజ్ దక్కేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలా ఉండగా సీతారామం సినిమా హౌజ్ ఫుల్ షోస్‌తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక లవ్ స్టోరీలను చక్కగా డీల్ చేస్తారనే పేరుంది దర్శకుడు హను రాఘవపూడికి. ఈ చిత్రంతో మరోసారి అది ప్రూవ్ అయింది. రోజా, కంచె, షేర్షా లాంటి సినిమాలను గుర్తు చేసినప్పటికీ సినిమా ఆద్యంతం ఎక్కడో ఓ ఎమోషన్ ఆడియన్స్ ని కథతో కనెక్ట్ చేస్తుంది.
Also Read :
గర్ల్‌ఫ్రెండ్స్ లేదా భార్యలకు మగవారు ఎక్కువగా చెప్పే అబద్దాలు ఇవే..!
“లైగర్” సినిమా మొత్తం అవేనా….? తెలుగు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా..?