సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికీ వర్కౌట్ చాలా ముఖ్యం. ఏ కాలంలోనైనా వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా అన్నింటికంటే ఎక్కువగా చలికాలంలోనే బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా మంది చలికి భయపడి వర్కౌట్ చేయరు. ఈ చలికాలంలో ఎక్సర్ సైజ్ చేయడం కోసం మనం కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
రన్నింగ్, వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వర్కౌట్. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. చల్లని వాతావరణంలో నడవడం, పరుగెత్తడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. చల్లని గాలి మీ ఏకాగ్రత, ఒత్తిడిని తగ్గిస్తాయి. రెండు బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. ఈ సమయంలో బాడీలో రక్తప్రసరణ తగ్గి శరీరం బిగుసుకుపోతుంది. దీంతో వర్కౌట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. బాడీనీ వెచ్చగా ఉంటే బట్టలను ధరించాలి. దీంతో శరీరం అంతగా చల్లబడదు. అలా ఎక్కువ ఎక్కువగా బట్టలు ధరించకూడదు.
Advertisement
కొన్ని వర్కౌట్స్ మార్నింగ్ చేస్తాం. కానీ చలికాలంలో అవి చేయలేం. అలాంటప్పుడు వాటిని లంచ్ బ్రేక్ లో చేయడం చాలా ఉత్తమం. దీంతో శక్తితో తిరిగి పని చేసేందుకు సహాయపడుతుంది. వాకింగ్, స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేయవచ్చు. దీంతో మానసిక సమస్యల శారీరక బలం, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ప్రతీరోజు వర్కౌట్ చేయడానికి కొన్ని యోగాసనాలు, ధ్యానం చేయవచ్చు. వీటిలో ముఖ్యంగా స్ట్రెచెస్ చేయాలి. స్ట్రెచెస్ వల్ల శరీరం వేడిగా మారి రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. కండరాలను సులువు చేసి పనితీరు మెరుగ్గా చేస్తుంది. దీంతో కండరాల ఒత్తిడి, నొప్పి తగ్గి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
మరికొన్ని తెలుగు లైఫ్ స్టైల్ వార్తలకు ఇక్కడ చూడండి. తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!