మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చాడు. అభిమానుల కోరిక మేరకు బాస్ ఇస్ బ్యాక్ అంటూ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో చిరంజీవికి గత వైభవం ఉంటుందా అన్న అనే అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ ఉత్సాహంతోనే వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు చిరు.
Advertisement
ఇది ఇలా ఉండగా చిరంజీవికి రాజశేఖర్ మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.రాజశేఖర్ గారు కాంగ్రెస్ లో ఉన్న సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాలనుకున్నప్పుడు రాజశేఖర్ గారు చేసిన విమర్శల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.
Advertisement
హీరో రాజశేఖర్ గారు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి రాజకీయాల్లో ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడారు.
దీంతో ఆగ్రహించిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ గారు తన కుటుంబంలో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేయడంతో చిరంజీవి గారు వెంటనే స్పందించి మరుసటి రోజు ఉదయాన్నే రాజశేఖర్ ఇంటికి వెళ్లారు.అయితే అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన వచ్చేవరకు ఎదురుచూసి ఆ తర్వాత ఆయనను కలిసి తన అభిమానులు ఆవేశానికి చిరంజీవి గారు మీడియా ముందు రాజశేఖర్ గారికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పినా ఆ గొడవ అంతటితో అయిపోయిందనుకున్న ఆ ఇష్యూ తాలూకు ఫలితాలు మాత్రం చాలా ఏళ్లు కొనసాగింది.