Home » చంద్రయాన్ 3 పై ఇస్రో ఛీప్ కీలక ప్రకటన.. ప్రయోగం అప్పుడేనా ?

చంద్రయాన్ 3 పై ఇస్రో ఛీప్ కీలక ప్రకటన.. ప్రయోగం అప్పుడేనా ?

by Anji
Ad

భారతీయ అంతరిక్ష సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. జులైలో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన పనులను అప్పుడే ప్రారంభించినట్టు ఇస్రో చీఫ్ ఎన్ సోమనాథ్ తెలిపారు. సోమవారం జీఎన్ ఎల్వీ-ఎఫ్12 రాకెట్ ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ గురించి విలేకరులు ప్రశ్నించగా.. చంద్రయాన్-3 ప్రాజెక్టును జూలైలో నిర్వహించనున్నట్టు తెలిపారు. జూలైలో పూర్తి చేయనున్నట్టు సోమనాథ్ తెలిపారు. దాని గురించి వివరిస్తూ.. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ లో మొత్తం మూడు రకాల మాడ్యూల్స్ ఉంటాయన్నారు. అందులో మొదటిది ప్రొపల్షన్ మాడ్యూల్ కాగా రెండోది ల్యాండర్ మాడ్యూల్ అని మూడవది రోవర్ మాడ్యూల్ ఉండనున్నాయని చెప్పారు. ఇప్పటికే ఇస్రో రెండు సార్లు చంద్రుడి పైకి వ్యోమనౌకలను పంపించిందని గుర్తు చేశారు.


బెంగళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో రూపుదిద్దుకున్న మూన్ శాటిలైట్ ఇప్పటికే శ్రీహరికోటను చేరుకున్నదని తెలిపారు సోమనాథ్. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్- 3ను తీసుకువెళ్లే ఎల్ వీఎం రాకెట్ ను రూపొందిస్తున్నట్టు సోమనాథ్ స్పష్టం చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ మూడు వారాల్లో మూన్ వద్దకు వెళ్ళనున్నదని చెప్పారు. చంద్రయాన్-2 ద్వారా పంపిన ఆర్బిటార్ ఇంకా పనిచేస్తుందని.. మూన్ ఉపరితలంపై ఉన్న ఆ ఆర్బిటార్ ఇంకా హై రిజల్యూషన్ ఇమేజ్ లను పంపుతోందని.. సోమనాథ్ మీడియాకు చెప్పారు.

Advertisement

Advertisement


ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎన్ వీఎస్-01 ఉపగ్రహంతో ఉదయం 10:42 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్-12 వాహననౌక.. నిర్దిష్టమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇక ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవితకాలం ముగిసిపోగా.. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతోంది ఇస్రో.. ఇక జీఎస్ ఎల్ వీఎఫ్-12 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ ప్రయోగంలో భాగస్వాములు అయిన అందరికీ అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్.

మరికొన్ని ముఖ్య వార్తలు : 

ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

నటనలో దేశం దాటుతున్న శ్రీలీలా..మామూలు ఆఫర్లు కావు..!!

Visitors Are Also Reading