భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ముఖేష్ అంబానీ కుటుంబం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రిలయన్స్ కి సంబంధించినటువంటి రిటైల్ వ్యాపార బాధ్యతలు చూసుకుంటుంది ఇషా అంబానీ. 2018లో ప్రముఖ వ్యాపారవేత్త ఆయిన అజయ్ పిరమల్ స్వాతి ఫిరమల్ దంపతుల కుమారుడు ఆనంద్ ఫిరమాల్ తో ఈషా అంబానీ ఏడడుగులు వేసింది. ఆనంద్ ఫిరమాల్ గ్రూప్ తరఫున ఫార్మా హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. వాస్తవానికి ఈశా ఆనందు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు.
also read:రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!
Advertisement
అలాగే వీరి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అయితే ఈషా ఆనంద్ మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారడంతో వీరి పెళ్లిని ఇది కుటుంబాలు కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించాయి. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఖరీదైన యాంటి లాలో 2018 డిసెంబర్ 12న ఈషా ఆనంద్ వివాహం జరిగింది. పెళ్లికి ముందే జైపూర్ ప్రాంతంలోని రాజభవనంలో ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పెట్టారు దాదాపు పెళ్లి వేడుక చాలా ఘనంగా జరిపారు. అయితే అప్పట్లో ఈషా అంబానీ వెడ్డింగ్ కార్డు ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు.
Advertisement
also read:యాంకర్ శ్రీముఖి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!
భారత దేశ అత్యంత సంపానుడైన ముఖేష్ అంబానీ ఏకైక కూతురు ఈశా. ఇక ఆమె వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. బాక్స్ రూపంలో బంగారంతో తయారుచేసిన ఈ వెడ్డింగ్ కార్డు అప్పట్లో అందరినీ ఆకర్షించింది. ఈ పెళ్లి పత్రికను రెండు అంచుల పెట్టెలో అమర్చారు. బాక్సులు తెరిచిన వెంటనే అందమైన శుభలేఖ కనిపించి, ఆ తర్వాత గాయత్రి మంత్రం వినిపించడం ఈ శుభలేఖ ప్రత్యేకత. ఇక దీని ధర విషయానికి వస్తే ఒక్కో వెడ్డింగ్ కార్డు అక్షరాల 5 లక్షలు. ఈ కార్డుతో మామూలు వ్యక్తులు అయితే రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేయవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల ఈషా అంబానీ ట్విన్స్ కు జన్మనిచ్చింది.
also read:Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!