Home » ఉదయ్ కిరణ్ కెరీర్ లో చేసిన అతి పెద్ద పొరపాటు అదేనా..? ఆ రోజు అలా చేయకుండా ఉండి ఉంటే..?

ఉదయ్ కిరణ్ కెరీర్ లో చేసిన అతి పెద్ద పొరపాటు అదేనా..? ఆ రోజు అలా చేయకుండా ఉండి ఉంటే..?

by AJAY
Ad

చిన్న‌వ‌య‌సులోనే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు దూర‌మైన న‌టుల‌లో ఉద‌య్ కిర‌ణ్ కూడా ఒక‌రు. ఉద‌య్ కిర‌ణ్ వ‌ర‌స హిట్ల‌తో అతిత‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉద‌య్ కిర‌ణ్ బ్యాక్ టూ బ్యాక్ మ‌రో రెండు హిట్స్ అందుకుని హాట్రిక్ కొట్టాడు. ఆ త‌ర‌వాత ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ లో తిరిగి వెన‌క్కి చూసుకోలేదు. కానీ అనుకోకుండా వ‌చ్చిన ఇబ్బందులు ఉద‌య్ కిర‌ణ్ ను చుట్టుముట్టాయి. అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాత‌లు వెన‌క్కి తీసుకోవ‌డం.

Advertisement

వ‌రుస ఫ్లాప్ లు ప‌డ‌టం…మరో వైపు ఫ్యామిటీ టెన్ష‌న్స్ ఇలా అనేక ఇబ్బందులు ఉద‌య్ కిర‌ణ్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే ఉద‌య్ కిరణ్ చేసిన ఓ త‌ప్పు వ‌ల్లే అలాంటి ప‌రిస్థితి వచ్చింద‌ని ఓ వార్త వైర‌ల్ అవుతోంది. సినిమాల ఎంపిక విష‌యంలో చేసిన త‌ప్పే ఉద‌య్ కిర‌ణ్ కొంప ముంచింద‌ట‌. వ‌రుస‌గా ప్రేమ‌క‌థ‌లు చేయ‌డం వ‌ల్ల ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చింది. అయితే ల‌వ‌ర్ బాయ్ గా ఇమేజ్ వ‌చ్చిన హీరోలు ఆ త‌ర‌వాత ఇండ‌స్ట్రీలో రాణించిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు.

Advertisement

కాబ‌ట్టి ఉద‌య్ కిర‌ణ్ విష‌యంలోనూ అలానే జ‌రిగిందంటున్నారు. వ‌రుస ప్రేమ‌క‌థల‌తో రావ‌డం ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్ట‌డం వ‌ల్లే ఉద‌య్ కిర‌ణ్ కు వ‌రుస ఫ్లాప్ లు ప‌డి ఆ త‌వ‌రాత ఆఫ‌ర్ లు లేకుండా పోయాయ‌ట‌. సాధార‌ణంగా అప్పట్లో మాస్ హీరోల‌కే ఎక్కువగా క్రేజ్ ఉండేది. ఎన్ని సూప‌ర్ హిట్ సినిమాలు చేసినా మాస్ హిట్ కొట్ట‌లేక‌పోతే హీరోగా నిల‌బ‌డ‌టం చాలా క‌ష్టం.

udaykiran

udaykiran

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో కొత్త హీరో త్రిగుణ్ ఆదిత్ కూడా అదే విష‌యాన్ని చెప్పారు. ఉద‌య్ కిర‌ణ్ త‌రుణ్ చేసిన త‌ప్పుల‌ను తాను చేయ‌న‌ని అన్నారు. ఈ యంగ్ హీరో మాట్లాడిన కామెంట్లు వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు కూడా ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బాయ్ చిత్రాల‌కు బ్రేక్ ఇచ్చి మాస్ సినిమా చేసి ఉంటే బాగుండ‌ని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఉద‌య్ కిర‌ణ్ సై సినిమాను రిజెక్ట్ చేసి ఉండ‌కుండా ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading