Telugu News » Akhanda 2: అఖండ 2 స్టోరీ ఇదేనట ..! పార్ట్ 2 లో జరగబోయేది ఇదే ..!

Akhanda 2: అఖండ 2 స్టోరీ ఇదేనట ..! పార్ట్ 2 లో జరగబోయేది ఇదే ..!

by Anji

సింహా, లెజెండ్ త‌రువాత బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడ‌వ సినిమా అఖండ‌. ఈ కాంబినేష‌న్‌పై ప్రారంభం నుంచి ఉన్న క్రేజీ అంచ‌నాలు నిజం చేస్తూ.. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఇటీవ‌లే అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న‌ది. ఈ సినిమా అటు వెండి తెర‌పై సంచ‌ల‌నాలే క్రియేట్ చేయ‌డంతో పాటు.. బుల్లితెర‌పై కూడా రికార్డుల వ్యూస్ కొల్ల‌గొడుతుంది. డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన అఖండ దూసుకెళ్లుతుంది. ముర‌ళీకృష్ణ అనే రైతు పాత్ర‌తో పాటు అఘోరాగా అద‌ర‌గొట్టాడు. అస‌లు బాల‌య్య అఘోరా పాత్ర‌ను చూసిన వారు అస‌లు పాత్ర బాల‌య్య త‌ప్ప ఇంకెవ్వ‌రూ చేయ‌లేరు. ఇక చేయ‌బోరు అని కితాబ్ ఇచ్చారు.

Ads

BO: Huge Surprise In Store For Balakrishna's Akhanda Lifetime Collections

Also Read: మ‌న దేశంలో ఫ్యాన్ రెక్క‌లు 3.. అమెరికాలో 4 రెక్క‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

ఆ వ‌య‌స్సులో బాల‌య్య పాత్ర అంత రౌద్ర ర‌సం ప‌లికిస్తూ.. చేయ‌డం అరాచ‌క‌మే అని చెప్పాలి. ఈ సినిమా హిట్ జోష్‌లో ఉన్న బోయ‌పాటి అఖండ‌కు సీక్వెల్ వ‌స్తున్న‌ద‌ని అఖండ‌-2 ఉండ‌నున్న‌ద‌ని క్లారిటీ ఇచ్చాడు. అఖండ‌-2 క‌థ ఇదేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్రచారం కూడా కొన‌సాగుతోంది. తొలి భాగంలో త‌ల్లి నుంచి వేర‌య్యాక అఖండ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కున్నాడు. త‌ల్లి కొడుకుపై ఉన్న ప్రేమ‌ను చంపుకోలేక త‌మ వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని కోర‌డం.. అఖండ అందుకు ఒప్పుకోక‌పోవ‌డం.. త‌న కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే అఖండ వ‌చ్చి ర‌క్షించారు. చివ‌రిలో అఖండ వెళ్లిపోతూ.. మ‌ళ్లీ ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. తాను క‌చ్చితంగా వ‌స్తాను అని చెప్పాడు.

Akhanda review: Nandamuri Balakrishna film is an assault on the senses | Entertainment News,The Indian Express

దీంతో సెకండాఫ్‌లో కూడా మ‌ళ్లీ అఖండ కుటుంబం ముప్పు ఎదుర్కుంటే.. ఆ ముప్పు నుంచి అఖండ ఎలా కాపాడ‌తాడు అనే అంశంతోనే ఈ పార్ట్ 2 తెర‌కెక్కుతుంద‌ని అంటున్నారు. సెకండ్ పార్ట్ ఎక్కువ‌గా అఖండ క్యారెక్ట‌ర్ మీద న‌డుస్తోందని, బోయ‌పాటి ఇప్ప‌టికే ఓ లైన్ అనుకోవ‌డంతో పాటు దానిని కొంత వ‌ర‌కు డెవ‌ల‌ఫ్ చేసిన‌ట్టు అసిస్టెంట్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. రెండ‌వ పార్ట్‌లో అఘోరాల గురించి మ‌రింత డెప్త్ గా సీన్లు ఉంటాయ‌ని పేర్కొంటున్నారు. ఏదేమైనా అఖండ‌-2కు బాలయ్య, బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ సీన్లు తోడు.. ఈ కాంబినేష‌న్ రిపీట్ అయితే మాత్రం మ‌రొక సారి సూప‌ర్ హిట్ గా నిలుస్తుంద‌నే చెప్పొచ్చు.

Also Read: బాలయ్య ఎంత క‌ట్నం తీసుకున్నారు? వ‌సుంధ‌ర ఎవ‌రి కూతురు?


You may also like