Home » “సర్కారు వారి పాట” సినిమా పై ‘డార్లింగ్’ ఇచ్చిన రివ్యూ ఇదేనా..!!

“సర్కారు వారి పాట” సినిమా పై ‘డార్లింగ్’ ఇచ్చిన రివ్యూ ఇదేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి. మూవీ బాగున్నా కానీ కొంతమంది పనిగట్టుకుని నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ప్రభాస్ సర్కారు వారి పాట సినిమాపై రివ్యూ ఇచ్చారు. ప్రభాస్ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మూవీ చూశారని ఫాన్స్ తెలియజేస్తున్నారు.మహేష్ బాబు సినిమా బాగుందని, ఆయన నటన నాకు చాలా బాగా నచ్చిందని, కామెడీ టైమింగ్స్, ఫైట్స్ కూడా బాగున్నాయని సినిమా చూసి ఎంజాయ్ చేసినట్టు డార్లింగ్ చెప్పేశారు.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలిసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మహేష్ బాబు మరియు ప్రభాస్ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే.. ప్రభాస్ హీరోగా “వర్షం” ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా మహేష్ బాబు వచ్చింది అందరికీ తెలుసు.. అలాగే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా వీరిద్దరు కనిపించారు. ప్రస్తుతం మహేష్ మూవీపై ప్రభాస్ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కార్ వారి పాట సినిమాకు డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కామెడీ మాత్రం చాలా బాగుంది అని చెప్పవచ్చు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా, వెన్నెల కిషోర్ నదియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

ALSO READ;

Advertisement

స‌మంత మాదిరిగానే న‌య‌న‌తార కూడా విడాకుల‌తో విడిపోతుంద‌ట‌.. అందుకోస‌మేనా..?

ఈ 6 సినిమాల్లో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ వేరే లెవల్..చూస్తే కన్నీళ్లు ఆగవు…!

 

Visitors Are Also Reading