Home » బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ కావడానికి ఇదే కారణమా ?

బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ కావడానికి ఇదే కారణమా ?

by Anji
Ad

బిగ్ బాస్ సీజన్ 6లో అసలు ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే టాప్ 5లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్స్ అయి హౌస్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఈ వారం కూడా అదే జరిగింది. ఈ ఎలిమినేషన్ లో ఊహించనివిధంగా బాలాదిత్య అవుట్ అయి బయటికి వచ్చేశాడు. ఎంత పాజిటివిటీతో అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెల్లాడో.. అదే పాజిటివ్ తో ఎలిమినేట్ అయి అందరితో మంచి అనిపించుకున్నాడు బాలాదిత్య. లాస్ట్ ఎలిమినేషన్ లో గీతూ బయటికి రావడానికి ఏడ్చి గగ్గోలు పెట్టిందో అందరికీ తెలుసు. కానీ బాలాదిత్య అలా కాదు నవ్వుతూనే బయటికీ వచ్చేశాడు. బయటికి వచ్చిన ఆదిత్య అందరికీ కాల్స్ తీసుకున్నాడు. సచిన్ ఫ్యాన్ ని  అని,  తాను కూడా 97 దగ్గర ఔట్ అయినట్టు చెప్పాడు బాలాదిత్య.

Advertisement

Advertisement

బాలాదిత్య బయటికి రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అతి మంచితనం కూడా బాలాదిత్య బయటికీ రావడానికి కారణమని చెప్పుకోవచ్చు. గీతూని చెల్లి అంటూ ఆమెతోనే ఎక్కువగా సమయం గడిపాడు. మిగతా హౌస్ మేట్స్ తో మాట్లాడుతున్న కూడా సరైన బాండింగ్ జరగలేదనే చెప్పాలి. చివరికీ గొడవ కూడా గీతూతోనే జరగడం కాస్త నెగిటివ్ అయిందని అనిపిస్తుంది. అదేవిధంగా నామినేషన్స్ విషయంలో కూడా సరైన పాయింట్ తీసుకోలేకపోయారు. సరైన రీజన్ చెప్పకుండానే నామినేషన్ చేయడం బాలాదిత్యకి మైనస్ అయిందనే చెప్పాలి.

 

 

బాలాదిత్య ఏ విషయాన్ని అయినా చాలా విడమరిచి వివరంగా చెప్పడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. తన గేమ్ తాను ఆడకుండా పక్క వారి గేమ్ లో తలదూర్చడం వారికి క్లాస్ తీవడం లాంటివి మైనస్ అయ్యాయనే చెప్పాలి. ఇవన్నీ మార్చుకుంటే బాలాదిత్య టాప్ 5లో ఉండేవాడు.

 

Visitors Are Also Reading