Home » హీరో “వెంకటేష్- నీరజల” పెళ్లి వెనుక ఉన్న అసలు కథ ఇదేనా..ఆమె ఎంత సంపన్నురాలంటే..?

హీరో “వెంకటేష్- నీరజల” పెళ్లి వెనుక ఉన్న అసలు కథ ఇదేనా..ఆమె ఎంత సంపన్నురాలంటే..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు అందరూ ఒకే విధంగా ఉంటారనేది మనకు ఉన్నటువంటి ఒక అపోహ మాత్రమే. వీరందరిలో కెల్లా స్టార్ హీరో వెంకటేష్ చాలా డిఫరెంట్. వెంకటేష్ ని చూస్తే హీరోలు ఈ విధంగా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. అంత మంచి వ్యక్తిత్వం హీరో వెంకటేష్ ది. తన మొదటి సినిమా కలియుగ పాండవులు నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీశారు కానీ ఇలాంటి రూమర్స్ లేకుండా ఉన్నది వెంకటేష్ గారు మాత్రమే. బాలకృష్ణ అనుస్టాపబుల్ ప్రోగ్రాంలో చెప్పినట్టు సినీ ఇండస్ట్రీ లో స్వామి వివేకానంద లాంటివారు వెంకటేష్ అన్నారు. మరి అలాంటి వెంకటేష్ నిజ జీవితంలో ఆయన పెళ్లి, సతీమణి నీరజ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..? ఇంతటి మహోన్నతమైన క్యారెక్టర్ ఉన్న వెంకటేష్ కు ఇప్పటికీ మహిళల్లో ఎంతో ఆదరణ ఉంది.

Advertisement

ఒక వివాహబంధంలో వారు అద్భుతంగా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం వారికి వచ్చిన జీవిత భాగస్వామి. అయితే వెంకటేష్ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్శనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన ఎప్పుడూ,ఎక్కడా తన భార్య, పిల్లల గురించి గాని కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడరు. నీరజారెడ్డి గంగవరపు వెంకటసుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు జన్మించింది. ఈమెది చిత్తూరు జిల్లా మదనపల్లి సొంత ఊరు. నీరజా కుటుంబం పెద్ద జమీందారీ కుటుంబం. ఆమె తండ్రి పెద్ద భూస్వామి. అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. మదనపల్లిలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి సుబ్బారెడ్డి. ఒకానొక సమయంలో రామానాయుడు వెంకటేష్ కు పెళ్లి చేయాలని ఎవరైనా అమ్మాయి ఉంటే చూడాలని విజయ నాగిరెడ్డి చెప్పగా నీరజా గురించి చెప్పారు. నీరజ అమ్మమ్మ గారిది కృష్ణాజిల్లా కాకిలూరు దగ్గర ఉన్న వరాహ పట్నం, వీరిది కూడా సంపన్న కుటుంబమే, నీరజా చదువుకునే రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మ వారి ఇంటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసే వారట.

Advertisement

నీరజ మేనమామ కామినేని శ్రీనివాస రావు 2014లో బిజెపి తరఫున కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్నికల సమయంలో నీరజా ప్రచారంలో పాల్గొన్న చాలా గ్రామాల్లో నీరజ సపోర్ట్ గా నిలిచారు. నీరజ మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ కాలేజీలో పదవ తరగతి వరకు చదివారు. తర్వాత మదనపల్లి లోని వీ.టి కాలేజీలో చదువుకున్నారు. నీరజా ఎంబీఏ పూర్తి చేశారు. అయితే నాగిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం గురించి చెప్పడంతో రామానాయుడు మదనపల్లి వెళ్లి ముందుగా నీరజాను చూసి వచ్చారు. తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో 1989 లో వెంకటేష్, నీరజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

also read;

సూర్య కూతురుకు టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వ‌చ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. రైతు బంధు నిధులు విడుద‌ల ఎప్పుడంటే..?

 

Visitors Are Also Reading