ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనతో నటించి సన్నిహితంగా ఉండేటువంటి చాలామంది నటీనటులు ఎన్నో కొత్త విషయాలను పంచుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని ఒక కొత్త విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ కు ఆహారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఆయన ఎంత ఆహారం తిన్నా కానీ మళ్లీ వ్యాయమాలు చేసి బాడీ ఫిట్ గా ఉంచుకునేవారు.
Advertisement
అలాంటి ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి 60 ఏళ్ల వయసులో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు ఊరు రా ప్రచార రథం ద్వారా యాత్ర చేశారు. ఈయనకు తన కొడుకు హరికృష్ణ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఈయన ప్రచారం చేసే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేవారు. అలా ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్న ఎన్టీఆర్ కోసం, అభిమానులు ఎంతగానో ఎదురు చూసేవారు.
Advertisement
అంతేకాదు ప్రతి స్టేషన్లో ఆయనకు ఎంతో ఇష్టమైన నేతి పెసరట్టు పట్టుకొని ఆ రైలు మొదలుపెట్టిన దగ్గర నుంచి దిగే వరకు అభిమానులు తీసుకువచ్చిన నేతి పెసరట్టు తింటూ వచ్చారట ఎన్టీఆర్. అలా మొదటి నుంచి చివరి వరకు ఏ అభిమానిని బాధ పెట్టకుండా నేతి పెసరట్లు తిన్నారట. అలా అంత పెద్ద నాయకుడు వాళ్లు చేసిన నేతి పెసరట్టు తినడంతో ప్రజలకు చాలా గుర్తుంది పోయిందట. అలా కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం తెలుగు రాష్ట్రాలకు ముఖ్య మంత్రి కావడం చక చక జరిగిపోయాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- ఆటోకు 3చక్రాలు ఎందుకుంటాయి..4ఎందుకు పెట్టరంటే..?
- Ugram : నరేష్ “ఉగ్రం” సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే ?
- Guntur Kaaram: మరోసారి కాపీ కొట్టాడు అంటూ థమన్ పై ట్రోల్స్..