Home » ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ రాబోతోందా…?

ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ రాబోతోందా…?

by AJAY
Ad

రాజమౌళి సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. దానికి కారణం జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మరో సినిమా ఆర్ఆర్ఆర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ జోరు కనిపిస్తోంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా సీక్వెల్స్ ను తీస్తున్నారు.

RRR FIRST RIVEW

Advertisement

Advertisement

ఇప్పటికే నాగార్జున హీరో నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాను తెరకెక్కించారు. ఇదిలా ఉండగానే ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు కూడా సీక్వెల్ ఉండబోతుంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే సీక్వెల్ కోసం కథను రెడీ చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

దాంతో త్వరలోనే సీక్వెల్ కూడా తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చెప్పలేము కానీ రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మరో రెండు మూడు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం డేట్స్ ఇవ్వడం చాలా కష్టం మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Visitors Are Also Reading