Telugu News » Blog » జ‌య‌సుధ నిజ జీవితానికి రాధేశ్యామ్ సినిమాకు ఉన్న లింక్ ఏమిటో తెలుసా..?

జ‌య‌సుధ నిజ జీవితానికి రాధేశ్యామ్ సినిమాకు ఉన్న లింక్ ఏమిటో తెలుసా..?

by AJAY
Ads

ఒక్కోక్క సారి సినిమాల‌లో సీన్‌ల‌లో నిజ‌జీవితంలో జ‌రుగుతుంటాయి. కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. ఇటీవ‌ల వ‌చ్చిన ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమాలో హీరో జాత‌కాలు చెబుతుంటాడు. ఆయ‌న చెప్పిన‌వ‌ని జ‌రిగేంత పేరు పామిస్ట్ రోల్‌లో ప్ర‌భాస్‌న‌టించాడు. సీనియ‌ర్ న‌టీ జ‌య‌సుధ జీవితంలో కూడా ఓ జ్యోతిష్కుడు చెప్పింది అక్ష‌రాల నిజం అయింది. విన‌డానికి విచిత్రంగా ఉన్న ఇది మాత్రం వాస్త‌వం. ఓ జ్యోతిష్యుడు ఏమి చెప్పాడు..? జ‌య‌సుధ జీవితంలో ఏమి జ‌రిగింద‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

జ‌య‌సుధ త‌ల్లిదండ్రులు జోగాబాయి, ర‌మేష్‌. త‌ల్లి జోగాబాయికి సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఉండ‌డంతో కొన్ని సినిమాల్లో న‌టించింది. కే.వీ.రెడ్డి పెద్ద మ‌నుషులు సినిమాలో ఓ నృత్య స‌న్నివేశంలో కూడా పాల్గొన్నారు. ర‌మేష్ ఆ రోజుల్లోనే మ‌ద్రాస్ కార్పొరేష‌న్‌లో ప‌ని చేసేవారు. జోగాబాయి ఇంటికి స‌మీపంలో ఉండేవారు. ర‌మేష్ ఆంధ్ర విజ్ఞాన స‌భ పేరుతో నాట స‌మాజం నిర్వ‌హించే వారు. అక్క‌డే వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. 1956 ఫిబ్ర‌వ‌రి 02న వీరికి పెళ్లి జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు సుజాత‌, సుభాషిణి, మ‌నోహ‌ర్‌, వెంక‌టేష్ పుట్టారు.

సుజాత ప్ర‌స్తుతం జ‌య‌సుధ పేరు. జ‌య‌సుధ‌కు సినిమాలంటే ఆస‌క్తి ఉండేది కాద‌ట‌. పైగా 3 గంట‌ల పాటు త‌లుపులు మూసేసిన థియేట‌ర్ లో ఎవ్వ‌రూ కూర్చొంటారని త‌ల్లితో వాదించేద‌ట‌. ర‌మేష్ ఓ సారి ఫ్రెండ్స్‌తో క‌లిసి బెంగ‌ళూరు వెళ్లార‌ట‌. అక్క‌డ జ‌యాన‌గ‌ర్‌లో బాగా జాత‌కాలు చెబుతార‌ని పేరున్న ఓ రిటైర్డ్ పోస్ట్ మాస్ట‌ర్ ఉండేవార‌ట‌. ఆయ‌న ఏమి చెబితే అదే జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉండేద‌ట‌. ర‌మేష్‌కు ఇష్టం లేక‌పోయిన ఫ్రెండ్స్ ఒత్తిడి చేయ‌డంతో ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి చేయి చూపించుకున్నాడ‌ట‌. ఆయ‌న చేయి చూసి ఏవేవో లెక్క‌లు వేసి మీ పెద్ద‌మ్మాయి పెద్ద న‌టి అవుతుంది. బోలెడంత పేరు ప్ర‌ఖ్యాతుల‌తో పాటు డ‌బ్బు కూడా వ‌స్తుంద‌ని చెప్పాడ‌ట‌. అయితే త‌న కుమార్తెకు అస‌లు సినిమాంటేనే ఇష్టం ఉండ‌దు. ఇదంతా అబద్ద‌మే అని చెప్పి ర‌మేష్ న‌వ్వుకున్నార‌ట‌.

ఓరోజ‌పు జ‌య‌సుధ ఇంట్లో లేక‌పోవ‌డంతో ఎక్క‌డికి వెళ్లింద‌ని భార్య జోగాయిని అడిగార‌ట‌. పండంటి కాపురం సినిమాలో చిన్న పాత్ర ఉందంటే మీ చెల్లి తీసుకువెళ్లింద‌ని చెప్పింద‌ట‌. విజ‌య‌నిర్మ‌ల ర‌మేష్ కు సొంత చిన్నాన కూతురు. అంటే జ‌య‌సుధ‌కు మేన‌త్త. సుజాత ఇంటికి రాగానే మ‌న‌కు సినిమాలెందుకు..? అని ర‌మేష్ ఫైర్ అయ్యార‌ట‌. అప్ప‌టిక ఆ సినిమా క‌మిట్ అవ్వ‌డంతో చేయ‌క‌త‌ప్ప‌లేదు. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఆమెకు మ‌రొక రెండు ఆఫ‌ర్లు రావ‌డం.. ఇలా వ‌రుస‌పెట్టి ఆఫ‌ర్లు వ‌స్తుండ‌డంతో ర‌మేష్ అవాక్క‌య్యార‌ట‌.

భార్య‌ను తీసుకుని బెంగ‌ళూరు వెళ్లి మ‌ళ్లీ ఆ జ్యోతిష్యుని క‌లిశార‌ట‌. అప్పుడు ఆయ‌న ఆమెకు రాసి పెట్టి ఉంది అంతే.. ఎవ‌రు ఎన్ని అవ‌రోధాలు క‌లిగించినా.. ఆమె న‌టిగా పేరు తెచ్చుకుంటుంద‌ని చెప్పార‌ట‌. ఆయ‌న చెప్పింది చెప్పిన‌ట్టుగానే జ‌రుగుతుండ‌డంతో ర‌మేష్ కుమార్తె సినిమా అవ‌కాశాల విష‌యంలో కాద‌న‌లేక‌పోయారు. చివ‌ర‌కు ఆమె పెద్ద స్టార్ అయిపోయింది. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో సుజాత పేరుతో ఓ హీరోయిన్ ఉండ‌డంతో ర‌మేష్‌, న‌టుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డితో చ‌ర్చించి ఆమె పేరు జ‌య‌సుధ గా మార్చారు. ఆ త‌రువాత ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

Also Read :  ఆ సినిమా పెద్ద అట్ట‌ర్ ప్లాప్‌.. కానీ ఎన్టీఆర్‌కు బాగా న‌చ్చిన సినిమా అదే..!


You may also like