Home » రాజ‌మౌళి మ‌హేష్ బాబుతో సినిమాని ఎంచుకోవ‌డం వెనుక ఇంత పెద్ద క‌థ ఉందా ?

రాజ‌మౌళి మ‌హేష్ బాబుతో సినిమాని ఎంచుకోవ‌డం వెనుక ఇంత పెద్ద క‌థ ఉందా ?

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఓట‌మి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా కూడా అది బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్‌ సినిమా తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలవడం, ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు, సినీ వర్గాలు స్పందించి ప్రశంసలు కురిపించడంతో రాజ‌మౌళి పేరు కూడా మారు మ్రోగిపోతుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్ లోనూ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రమోషన్ కోసం అని చిత్ర‌బృందం జపాన్ వెళ్లారు.

Also Read : శ్రీ‌కాంత్ గురించి సీనియ‌ర్ హీరోయిన్ లైలా ఏమందో తెలుసా ?

Advertisement

ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా కోసం కొద్ది రోజులుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ రేంజ్ లో అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచరస్ గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. తాజాగా ఈ కథని నిజ జీవితం ఆధారంగా రాసుకున్నదని తెలిపారు. ఈ కథకి మహేష్ అయితే పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడు అని భావించి అతన్ని ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం తాను రాజమౌళి కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నామని, అది పూర్తవడానికి ఇంకాస్త టైం పడుతుందన్నారు. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని, బడ్జెట్ వైజ్ గానూ భారీగా ఉండబోతుందని చెప్పారు.

Advertisement

Also Read : రామానాయుడు చివ‌రి కోరిక ఏంటో తెలుసా..? అది వెంక‌టేష్ తీరుస్తాడా ?

రాజమౌళి-మహేష్ బాబు సినిమాకి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘SSMB28’ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఇందులో విలన్ పాత్రల కోసం ఇద్దరు స్టార్ హీరోలను తీసుకోబోతున్నారు. తమిళ హీరో కార్తీ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Also Read : ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. జ‌పాన్‌లో కూడా..!

 

Visitors Are Also Reading