Home » దుబాయ్ లో బంగారం ధర తక్కువా ? ఎంత ?

దుబాయ్ లో బంగారం ధర తక్కువా ? ఎంత ?

by Bunty
Ad

ఎవరైనా దుబాయ్ టూర్‌కి వెళ్తే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు బంగారం కొనుక్కుని ఇండియా రావాలని కోరుకుంటారు. ఎందుకంటే అక్కడ బంగారం ధర తక్కువ అనేది లోకుల మాట. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉండడమే ఇందుకు మొదటి కారణం. అక్కడ బంగారం ధర విషయానికొస్తే… ఇక్కడ 1 గ్రాము బంగారం ధర 216.00 AED, 10 గ్రాముల ధర 2160 AED. దానిని ఇండియా రూపాయిలోకి మారిస్తే అక్కడ బంగారం ధర రూ. 44,107. అంటే దుబాయ్ నుండి కొనుగోలు చేసిన బంగారం ధర సుమారు 44 వేలకు లభిస్తుండగా, భారతదేశంలో దాని రేటు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధర విషయానికి వస్తే… దాదాపు 49 వేల రూపాయల ధరలు ఉన్నాయి. అంటే అక్కడ నుండి బంగారం తీసుకొస్తే 10 గ్రాములకి దాదాపు 6 వేల రూపాయల తేడా ఉంది. ఈ రేటు 24 క్యారెట్ల బంగారం గురించి.

Advertisement

gold

Advertisement

దీనికి రెండో కారణం దుబాయ్‌లో బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉండటం. దుబాయ్‌లోని బంగారం ఇతర దేశాల కంటే చాలా మెరుగ్గా ఉందని, మంచి డిజైన్ అని తెలుస్తోంది. అందుకే ప్రజలు బంగారం కొనడానికి దుబాయ్‌కి వెళతారు. వెళ్లిన వాళ్ళను కొనుక్కురమ్మని కూడా కొంతమంది చెబుతారు. అయితే ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాలంటే దానికి కొన్ని షరతులు, రూల్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.

Visitors Are Also Reading