Home » అయోధ్య సీతాదేవికి అత్తగారిఇల్లైనా కూడా ..! ఎందుకు శపించింది ? చివరకు ఇలా విమోచనం లభించిందా..?

అయోధ్య సీతాదేవికి అత్తగారిఇల్లైనా కూడా ..! ఎందుకు శపించింది ? చివరకు ఇలా విమోచనం లభించిందా..?

by Anji
Ad

సాధారణంగా తీర్థ యాత్రలు చేసే వారికి ఉత్తరప్రదేశ్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే నగరాలు కాశీ, మథుర. కాశీ నగరానికి చాలా ప్రత్యేకత ఉంది. కాశీకి పోయినా.. కాటికి పోయినా ఒక్కటే అనే సామెతలున్నాయి. శ్రీకృష్ణ జన్మస్థానం మథుర గురించి కూడా కావాల్సినన్నీ ఇతిహాసపు కథలున్నాయి. ఈ రెండు నగరాలతో పాటు త్రేతా యుగం నుంచే అయోధ్య నగరం కూడా యూపీలో ఉన్నప్పటికీ కాశీ, మథుర నగరాలకు ఉన్నంత ఆకర్షణ, చైతన్యం ఇంత కాలం లేవు. 

Advertisement

రామజన్మభూమి కావడంతో కాశీ, ప్రయోగ వెళ్లి వారిలో కొందరూ అయోధ్యను కూడా సందర్శించేవారు. ప్రత్యేకంగా అయోధ్య కోసం యాత్ర చేసే సందర్భాలు చాలా అరుదు అనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కి కూతవేటు దూరంలోనే ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. నేరుగా అయోధ్యకి చేరుకునే రైళ్లు లేవు. వేరే నగరాల్లో రైలు మారి చేరుకున్నా.. రైలు దిగిన తరువాత చూస్తే.. నిర్మానుష్యంగా పాడుబడిన స్థితిలో రైల్వే స్టేషన్ కనిపించేది. కేవలం సాధుసంతులు, సౌకర్యంతో పెద్దగా పట్టింపు లేని ప్రజలు ఉండేందుకు సత్రాలు ఆశ్రమాలు, ధర్మశాలలు అక్కడ అందుబాటులో ఉండేవి. ఇరుకైన వీధులు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లతో అయోధ్యను నిజంగా శాపగ్రస్త నగరాన్ని తలపించేలా ఉండేది.

Advertisement

కానీ కాశీ, ప్రయోగ, మథుర, బృందావన్ వంటి ఇతర పుణ్యక్షేత్రాల్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. స్టార్ హోటళ్లతో పాటు సందడిగా ఉండే మార్కెట్లు ఈ నగరాల్లో ఉండేవి. అయోధ్యకు ఇంతకాలం వైభవం లేకపోవడం వెనుక కారణమేంటి అని అడిగితే.. సీతాదేవి శాపమేనని అక్కడి వారు సమాధానం చెప్పడం గమనార్హం. అత్తింటి అయోధ్యను సీతాదేవి ఎందుకు శపించింది అనే సందేహం ఎవ్వరికైనా కలుగుతుంది. రావణాసురుడిని వధించి లంకను జయించి సీతను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన తరువాత సీతాదేవి అగ్నీ పరీక్షను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన సీతాదేవిని తీవ్రంగా బాధించింది. అయినప్పటికీ రాముడి కోసం భరించిన సీతమ్మను.. ఆ తరువాత కూడా అయోధ్య వాసులు విడిచిపెట్టలేదు. నోటికొచ్చినట్టు నానా రకాలుగా తిట్టడంతో చివరికీ నిండు గర్భిణీగా ఉన్న సీతాదేవిని అడవుల పాలు చేయాల్సి వచ్చింది.

ఈ పరిస్థితికి కారణమైన అయోధ్య వాసులపై కోపంతో సీతాదేవి శపించిందని స్థానికుల నమ్మకం. సీతమ్మ శాపం కారణంగానే ఉత్తారాదిన భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న కేదరినాథ్, బ్రదీనాథ్, అమర్ నాథ్ సహా పలు పుణ్యక్షేత్రాలు ఎంతో వైభవంగా వెలిగిపోతుంటే అయోధ్య మాత్రం శాపగ్రస్త నగరం అన్నట్టుగానే నిస్తేజంగా అభివృద్ధికి యాత్రికుల ఆకర్షణకు నోచుకోకుండా ఉండిపోయింది. 1528లో విధ్వంసానికి గురైన రామజన్మభూమి ఆలయం 496 ఏళ్ల తరువాత 2024 జనవరి 22న ప్రారంభోత్సవానికీ నోచుకుంది. రామజన్మభూమిలో భవ్యమైన మందిరంతో పాటు అయోధ్య నగరాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం నిర్మించే మౌళి వసతుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తోంది.  పాడుపడిన భవంతిని తలపించిన పాత అయోధ్య జంక్షన్ పేరు అయోధ్య రామ్ జంక్షన్ గా మార్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలు అయోధ్యకు చేరుకునేలా రైలు సర్వీసులు శరవేగంగా నడిచే వందేభారత్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ అభివృద్ధిని చూస్తే.. సీతాదేవి శాపం ఎట్టకేలకు తొలగిపోయిందని స్థానికులు హర్శం వ్యక్తం చేస్తున్నారు. 

 

Visitors Are Also Reading