Home » “కాంతార‌”లోని సూప‌ర్ హిట్ సాంగ్ “వ‌రాహ రూపం” పాట‌ను అక్క‌డ నుండి లేపేశారా..?

“కాంతార‌”లోని సూప‌ర్ హిట్ సాంగ్ “వ‌రాహ రూపం” పాట‌ను అక్క‌డ నుండి లేపేశారా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్న సినిమా పేరు కాంతార‌. ఈ క‌న్న‌డ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిష‌బ్ శెట్టి హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా కేవ‌లం క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను తెర‌కెక్కించిన హోంబ‌లే బ్యాన‌ర్ నిర్మించింది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ ప్ర‌భాస్ లాంటి స్టార్ లు ప్ర‌శంస‌లు కురిపించారు.

Advertisement

దాంతో తెలుగుతో పాటూ ఇత‌ర భాష‌ల్లోనూ సిన‌మాను రిలీజ్ చేశారు. అలా క‌న్న‌డ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారింది. ఈ సినిమా క‌థ క‌థ‌నం పాట‌లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో వ‌చ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గౌస్ బంప్స్ తెప్పిస్తోంది. అయితే ఇలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాను ఇప్పుడు ఓ వివాదం చుట్టుముడుతోంది.

Advertisement

ఈ సినిమాలోని ఓ పాట‌ను కాపీ కొట్టారు అంటూ వివాదం మొద‌ల‌య్యింది. ఆ పాట మరేదో కాదూ కాంతార సినిమాలోని సూప‌ర్ హిట్ పాట వ‌రాహ రూపం…అనే పాట ఈ పాట‌ను కాపీ కొట్టారు అంటూ కేర‌ళ‌కు చెందిన సంగీత బృదం తాయి కూడం బ్రిడ్జ్ చిత్ర బృందం పై ఆరోప‌ణ‌లు చేసింది. ఈ మేర‌కు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది.

త‌మ పాట‌ను కాపీ కొట్టార‌ని త‌మ‌కు కాంతార సినిమాతో ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంది. త‌మ పాట‌ను కాపీ కొట్టారు అని ఆరోపించింది. స్పూఫ్ గా తీసుకోవ‌డం కాపీ కొట్ట‌డం వేరు అని చెప్పింది. అంతే కాకుండా స‌ద‌రు సంగీత బృందం ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్లు స‌పోర్ట్ చేయాలని కోరింది. మ‌రి ఈ విష‌యం పై కాంతార సినిమా చిత్ర యూనిట్ ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading