ఎపి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి నెలపైనే అవుతోంది. ఇప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు చంద్రబాబు నాయుడుకు స్కిన్ అలెర్జీ వచ్చిందని.. అక్కడ వాతావరణం, శుభ్రత బాగుండలేదని.. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆయన పట్ల అమానవీయ ధోరణి అవలంబిస్తోంది అంటూ అటు కుటుంబసభ్యులు ఇటు జనసేన పార్టీ కార్యకర్తలతో సహా అందరు వ్యాఖ్యానిస్తుండడంతో.. ఇదంతా వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తోంది అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది.
Advertisement
బలమైన ఆర్ధిక మద్దతు, మీడియా అండదండలు ఉండడంతో టీడీపీ సెంటిమెంట్ బాగానే పని చేస్తున్నట్లు ఉంది. నెల రోజులు కావొస్తున్నా ఈ విషయాన్నీ ప్రజల మైండ్ లో లైవ్ గా ఉండేలా చేయడంలో టీడీపీ కి మీడియా సపోర్ట్ బాగానే ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇదంతా టీడీపీ పై సానుభూతి పెరిగి.. వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తోంది అన్న అభిప్రాయాలూ ప్రజల్లో కలిగించేలా వార్తలు ప్రసారం చేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
Advertisement
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటికీ.. ఆయనకు సంబంధించిన ప్రత్యక్ష వివరాలు ఏమీ ప్రజలకు తెలియకపోవడం వలన టీడీపీ మద్దతు మీడియా పధకం ప్రకారంగా చంద్రబాబుకు అన్యాయం జరుగుతోంది అన్న విషయాన్నీ పదే పదే హైలైట్ చేయడం కూడా వైసీపీ ని ఇరకాటంలో పడేస్తోంది. ఆయనకు ఏమీ కాలేదన్న విషయాన్నీ వైసీపీ గట్టిగానే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు నెలలు చంద్రబాబు నాయుడు బయటకు రాలేక.. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం.. ఇది కచ్చితంగా ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉంది. చంద్రబాబు విషయంలో ప్రభుత్వం అన్ని నియమాలను పాటిస్తున్నప్పటికీ.. వాటి గురించి పదే పదే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో.. టీడీపీ సెంటిమెంట్ అస్త్రం బాగానే పని చేస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని..
పల్లవి ప్రశాంత్ పై నెటిజన్లు ఆశ్చర్యకర కామెంట్స్.. మరీ ఎక్కువైందంటూ..!
బిగ్ బాస్ షోను నాగార్జున చూస్తారా? చూడరా? అసలు నిజం వెల్లడి..!
లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?