Home » ధ‌నుష్-ఐశ్వ‌ర‌ల కొంప ముంచిన సుచీలీక్స్..?

ధ‌నుష్-ఐశ్వ‌ర‌ల కొంప ముంచిన సుచీలీక్స్..?

by AJAY
Ad

కోలీవుడ్ స్టార్ కపుల్ ధ‌నుష్ ఐశ్వ‌ర్య‌ల విడాకుల వ్య‌వ‌హారం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపింది. 18 ఏళ్లపాటు అన్యోన్యంగా గ‌డిపిన జంట ఒక్క‌సారి విడాకులు ప్ర‌క‌టించ‌డంతో అంతా షాక్ అయ్యారు.ముఖ్యంగా ధ‌నుష్ అభిమానులు మ‌రియు ర‌జినికాంత్ అభిమానులు విడాకుల విష‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు. అయితే వీరిద్ద‌రి విడాకుల‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Advertisement

ముఖ్యంగా విడాకుల‌కు కార‌ణం ధ‌నుష్ అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా గ‌తంలో క‌ల‌క‌లం రేపిన సుచీలీక్స్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. 2017 లో సుచీలీక్స్ లో మ‌రి కొంద‌రు హీరోల‌తో పాటూ ధ‌నుష్ ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్ త్రిష మ‌రియు అమ‌లాపాల్ ల‌తో పాటూ క‌లిసి దిగిన ఫోటోలు బ‌యట‌కు వ‌చ్చాయి. దాంతో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో ఆ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

అయితే సుచీలీక్స్ ఇష్యూ జ‌రిగి నాలుగేళ్లు అవుతోంది. ఆ స‌మయంలో ధ‌నుష్ ఐశ్వ‌ర్య ల మ‌ధ్య వివాదాలు రాగా ర‌జినీకాంత్ కూతురుకు న‌చ్చజెప్పార‌ట‌. కానీ ధనుష్ కు ఇండ‌స్ట్రీలో కొంత‌మంది హీరోయిన్ల‌తో ఎఫైర్లు ఉన్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికీ కూడా ధ‌నుష్ ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

dhanush suchi eaked-pictures

అంతే కాకుండా దాని వ‌ల్లే భ‌రించలేక ఐశ్వ‌ర్య విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక తాము విడాకులు తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు ర‌జినీ కాంత్ కు చెప్పగా ఆయ‌న కూడా త‌మ‌కు న‌చ్చింది చేయాల‌ని స‌లహా ఇచ్చార‌ట‌. ఇదిలా ఉండ‌గా ధ‌నుష్ ఐశ్వ‌ర్య‌ల‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

Visitors Are Also Reading