Home » Balakrishna: బాలకృష్ణకు అంతటి స్టార్డం రావడానికి కారణం ఆవిడేనా..!!

Balakrishna: బాలకృష్ణకు అంతటి స్టార్డం రావడానికి కారణం ఆవిడేనా..!!

by Sravanthi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఎంతటి స్టార్ హోదా ఉందో మనందరికీ తెలుసు.. ఆయన అంత పెద్ద స్టార్ అయినా సరే ఇప్పటికీ ఆవిడ లేకుంటే ఇంట్లో నుంచి బయటకు రారట.. ఎలాంటి పని మొదలుపెట్టినా ఆవిడ చేత్తో డబ్బు తీసుకోవాల్సిందే.. ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారంటే కారుకు ఎదురు రావాల్సిందే.. అంతటి అదృష్ట దేవత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి, ఈవిడ శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ దేవులపల్లి సూర్యారావు ప్రమీల రాణి దంపతుల కుమార్తె.. వీరి వివాహం 1982 డిసెంబర్లో జరిగింది.. మొదటి చూపుల్లోనే ఈవిడ బాలయ్యకు బాగా నచ్చిందట..

also read:వాట్సాప్ లో కొత్త ఫీచర్ గురించి తెలుసా ? ఇక నుంచి అలాంటివి కుదరవు..!

అయితే వీరికి ముగ్గురు సంతానం. బ్రాహ్మణి తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ… మొదటి నుంచే సంపన్నుల కుటుంబంలో పుట్టిన వసుంధర పై చదువులు చదివింది.. బాలయ్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికే పరిమితమై ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడ చూసుకుంటుందట.. భర్తకు ఎప్పుడు ఆసరాగా ఉంటూ ముందుకెళ్తుందట.. ఆయన రాజకీయ ప్రచారాల్లో కూడా ఈవిడ పాల్గొంటుందట.. కట్ చేస్తే వసుంధర అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం.. ఆమె హ్యాండ్ ఎంతో లక్కీ అని నమ్ముతారు.. ఆమె చేత్తో డబ్బులు ఇస్తే వారి దశ తిరిగినట్టేనట.. ఇండస్ట్రీలో కూడా ఆమె చేత్తో డబ్బులు తీసుకుంటే కలిసి వస్తుందని నమ్ముతారు.. బాలకృష్ణ ఎలాంటి పని మొదలుపెట్టినా ఆమె చేతి ద్వారానే డబ్బులు తీసుకుంటారు.

అంతేకాకుండా బాలకృష్ణ బయటకు వెళ్లే ప్రతిసారి ఆమె కారుకు ఎదురు వస్తేనే బయటకు వెళ్తారని, అలా చేస్తేనే మంచి జరుగుతుందని వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారట.. అంతేకాకుండా వసుంధర వారిని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తారని, ఆమె గొప్పింటి కోడలే కాకుండా గొప్ప మనసు ఉన్న ధీరవనిత అంటూ పలువురు అంటున్నారు. ఈ విధంగా బాలకృష్ణ కు వసుంధర అంటే ఎంతో లక్కీ అని ఇప్పటికీ నమ్ముతారట. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో నిలవనున్నారు..

also read:

Visitors Are Also Reading