Home » షేన్ వార్న్ కు సిగరెట్స్ అంటే అంత ఇష్టమా…? అతని కళ్ళు ఆ రంగులో ఎందుకు ఉంటాయి…?

షేన్ వార్న్ కు సిగరెట్స్ అంటే అంత ఇష్టమా…? అతని కళ్ళు ఆ రంగులో ఎందుకు ఉంటాయి…?

by Venkatesh
Ad

అంతర్జాతీయ క్రికెట్ లో షేన్ వార్న్ వేసిన ముద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేక ఎందరో క్రికెట్ దిగ్గజాలు బోల్తా పడ్డారు. ఆస్ట్రేలియా తరుపున ఒకప్పుడు వార్న్ తురుపు ముక్క. సచిన్, ద్రావిడ్, గ్రేం స్మిత్, లారా, స్త్రాస్ వంటి ఎందరో బ్యాటింగ్ దిగ్గజాలు అతని బౌలింగ్ ను ఎదుర్కోవడానికి గులకరాళ్ళ మీద ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి షేన్ వార్న్ గురించి ఎవరికి తెలియని ఏడు రహస్యాలు ఉన్నాయి.

అతను తన మొదటి టెస్ట్ ఆడినప్పుడు, అతని బరువు 97 కిలోలు. ఆ తర్వాత బరువు పెరగడమే కాని తగ్గలేదు.

Advertisement

కంప్లీట్ హెటెరోక్రోమియా అనే పరిస్థితి కారణంగా అతని ఒక కన్ను ఆకుపచ్చగా ఉంటే మరొకటి నీలం రంగులో ఉంటుంది

Advertisement

మాజీ భార్య సిమోన్ కల్లాహన్‌తో అతను ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఈ విషయం క్రికెట్ ప్రపంచానికి చాలా రోజుల తర్వాత తెలిసింది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత… షేన్ వార్న్… ఎందరో అనారోగ్యం తో ఉన్న పిల్లలకు వైద్య సహాయం అందించాడు. ఇందుకోసం తన ఆస్తులు కూడా అమ్ముకున్నాడు.

2011లో నటి ఎలిజబెత్ హర్లీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. కాని పెళ్లి కాకుండానే రెండేళ్ల తర్వత వీరు ఇద్దరూ విడిపోయారు.

1995లో ఒక బుకీకి పిచ్ సమాచారం ఇచ్చినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జరిమానా విధించింది.

ఒకప్పుడు సిగరెట్ అలవాటు మానడానికి నానా కష్టాలు పడ్డాడు. సిగరెట్ విషయంలో ఆస్ట్రేలియా బోర్డు జరిమానా కూడా విధించాడు. కాని సిగరెట్ మాత్రం చివరి వరకు వార్న్ వదిలి పెట్టలేదు.

Visitors Are Also Reading