Home » పాన్ ఇండియా లెవెల్ లో “సర్కారు వారి పాట” రాబోతుందా.. ఇక ఆ సినిమాలు పనికి రావట..!!

పాన్ ఇండియా లెవెల్ లో “సర్కారు వారి పాట” రాబోతుందా.. ఇక ఆ సినిమాలు పనికి రావట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ హీరో హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురాం పెట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ప్లేస్ ఏఎంబి మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 12వ తేదీన భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను బాగా రాబడుతూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. కేవలం సినిమా విడుదలైన ఐదు రోజులకే 160 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అలాగే 100 కోట్ల షేర్ ని సాధించడం విశేషం. అయితే ఒక రీజనల్ సినిమా ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి షేర్ ని రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా సర్కారు వారి పాట సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అక్కడ ఇప్పటికే రెండు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేసి దుమ్ము దులుపుతుంది. సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ చూసి మహేష్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రీజనల్ సినిమాతోనే మహేష్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తే ఒకవేళ పాన్ ఇండియా సినిమా అయితే మాత్రం బాక్సాఫీసు దద్దరిళ్ళిపోయేదని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అభిమానుల కోరిక మేరకు సర్కార్ వారి పాట సినిమా ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నారట. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లను నమోదు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కే జి ఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు మంచి రికార్డును నమోదు చేసుకున్నాయి. సర్కారు వారి పాట సినిమాకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయాలని మూవీమేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు కి తమిళంలో, అలాగే నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ కారణంగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని చిత్ర యూనిట్ అనుకుంటోందట. కాని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

ALSO READ;

Advertisement

“అశోక వనం లో అర్జున కళ్యాణం” సినిమా లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

అమ్మో ఆకాశం నుంచి ఇనుప గోలీలు పడ్డాయట.. ఎక్కడో తెలుసా..!!

 

Visitors Are Also Reading