Home » రెండో పెళ్లికి రెడీ అంటున్న సామ్..?

రెండో పెళ్లికి రెడీ అంటున్న సామ్..?

by Azhar
Ad

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో సమంత తాను ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత కారణాలు ఏంటి అనేవి తెలియదు.. కానీ ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటినుండి సింగిల్ గానే ఉంటున్నారు. కానీ ఈ మధ్యనే చైతన్య, రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని, త్వరలోనే మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని టాక్ నడుస్తుంది.

Advertisement

అయితే ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్ళికి ఓకే చెప్పిందని సమాచారం. చైతన్యతో విడాకుల తర్వాత నుండి ఒంటరిగానే ఉంటున్న సమంత ప్రస్తుతం తన కెరియర్ పైన ఫోకస్ పెట్టింది. కానీ తన కుటుంబసభ్యులు మాత్రం ఎప్పటినుంచో ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట.

Advertisement

ఇంతకాలం వారికీ నో చెప్పిన సామ్.. ఇప్పడు తన కుటుంబసభ్యుల భాధను చూడలేక ఓకే చెప్పిందని.. తన పెళ్లి బాధ్యత మొత్తం వారికే అప్పగించిందని తెలుస్తుంది. కానీ ఒకవేళ తనను, తన ప్రొఫెషన్ ను అర్ధం చేసుకునే అబ్బాయి దొరికితే మళ్ళీ ప్రేమించే పెళ్లి చేసుకుంటానని కూడా ముందే చెప్పిందట సామ్.

ఇవి కూడా చదవండి :

చాహల్ పోజ్ పై పేలుతున్న మీమ్స్..!

ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

Visitors Are Also Reading