కరోనా మహమ్మారి తరువాత బాలీవుడ్ నుంచి అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం ఏదైనా ఉందంటే అది బ్రహ్మాస్త్ర అనే చెప్పవచ్చు. ఇటీవల చాలా సినిమాలు విడుదలైనప్పటికీ అవి ఆశించిన మేరకు ఆకట్టుకోలేదనే చెప్పాలి. రణబీర్, అలియాభట్ జంటగా నటించిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. భారీ బడ్జెట్ తో సుమారు మూడేళ్ల పాటు ఈ సినిమాని తెరకెక్కించారు. సెప్టెంబర్ 09న పలు భాషల్లో విడుదలైంది.
విడుదల మూడు రోజుల్లోనే ఈ సినిమా కేవలం భారత్‌లో అయితే మాత్రం రూ.128 కోట్లకు పైగా వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో RRR, KGF చాప్టర్ 2 చిత్రాలకు మాత్రమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి. తెలుగులో బ్రహ్మాస్త్రకి మంచి రెస్పాన్స్ రావడానికి కారణం మాత్రం రాజమౌళి అనే చెప్పవచ్చు. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ష్ మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు. తన సొంత సినిమాకి ప్రమోషన్స్ ద్వారా రాజమౌళి ఎలాంటి క్రేజ్ తీసుకొస్తాడో అందరికీ తెలిసిందే. బ్రహ్మాస్త్రకి కూడా ఆయన ఆ రేంజ్ క్రేజ్ తీసుకొచ్చాడు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : కృష్ణంరాజు గవర్నర్ కాకపోవడానికి కారణం అదేనా..?
దాని ఫలితమే ఇవాళ మనం చూస్తున్న అద్భుతమైన వసూళ్లు అని చెప్పవచ్చు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఏర్పాటు చేసి బ్రహ్మస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు హ్యాండ్ ఇచ్చారు. రాజమౌళి అప్పటికప్పుడు ప్రెస్ పెట్టారు. ఎన్టీఆర్ కూడా వచ్చే లా చూశారు. మరోవైపు ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హిందీ ఫిల్మ్ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ న్యూస్‌గా మారింది. సినిమా వసూళ్లు బాగుండడంతో బాలీవుడ్ నటులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి నెగిటివ్ వినిపించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి : చిరంజీవి విక్టరీ వెంకటేష్ మధ్య ఒక కామెడీ సన్నివేశం.. ఏ సినిమాలో తెలుసా..?