Home » ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా..ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ ఇదేనా..?..హింట్ ఇదే..!

ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా..ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ ఇదేనా..?..హింట్ ఇదే..!

by AJAY
Ad

ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాకు పరిచయమయ్యారు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ అనే పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఎమోషన్స్ ఉన్న ఈ పాత్రలో ఎన్టీఆర్ జీవించాడు. కొన్ని సీన్లలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.

Advertisement

ముఖ్యంగా కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ హావభావాలు చూస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒక చేతిలో గొడ్డలి …..మరో చేతిలో వేట కొడవలి ని పట్టుకొని ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. పోస్టర్ లో ఎన్టీఆర్ చీకట్లో సముద్రం ఒడ్డున ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కంటే ముందు కొరటాల శ్రీనివాస్ అల్లుఅర్జున్ తో ఓ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లను కూడా విడుదల చేశారు.

అయితే ఈ పోస్టర్ లో కూడా అల్లు అర్జున్ చీకట్లో సముద్రం ఒడ్డున నిలబడి ఉంటాడు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేశాడు. ఇక ఈ రెండు పోస్టర్లు ఒకే విధంగా ఉండటంతో అల్లు అర్జున్ తో అనుకున్న కథ తోనే ఇపుడు కొరటాల ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఎన్టీఆర్ సినిమా కథ ఏంటనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Also read :

JR NTR BIRTHDAY SPECIAL : మీరెప్పుడూ చూడని JR ఎన్టీఆర్ ఫోటోలు…!

Visitors Are Also Reading