Telugu News » Blog » అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ పక్కన బెడుతున్నారా…?

అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ పక్కన బెడుతున్నారా…?

by Manohar Reddy Mano
Ads
టాలీవుడ్ లోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. కానీ ఆ తర్వాత ఆయన కుటుంబం నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరందరిని కలిసి అభిమానులు మెగా ఫ్యామిలీ అని పిలుచుకుంటారు. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏ హీరో సినిమా వచ్చిన సరే.. దాని ఫంక్షన్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అని అభిమానులు అరుస్తారు. హీరోలు కూడా వారి గురించి మాట్లాడుతారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు. తాను ఏ ఫంక్షన్ కు వచ్చిన… అక్కడ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. ఇలా ఒక్కసారి తన ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాలంటూ ఫ్యాన్స్ అరిస్తే మాట్లాడాను బ్రదర్ అంటూ చెప్పేసాడు. దాంతో అప్పటి నుండి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను దూరం పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పడు దానిని నిజం అనేలా మరో ఫోటో బయటకు వచ్చింది. అయితే తాజాగా ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు విజయ వాడాలో ఓ మీటింగ్ ను ఏర్పాటు చేసారు.
ఆ మీటింగ్ లో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. అందులో ముగ్గురు మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో పాటుగా రామ్ చరణ్ ఫోటోను మాత్రమే వేశారు. కానీ అల్లు అర్జున్ ఫోటోను మాత్రం వెయ్యలేదు. ఈ ఒక్క ఫ్లెక్సీతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ను దూరం పెడుతున్నాడు అనేది స్పష్టం అయ్యింది. అయితే ఈ మీటింగ్ లో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ యొక్క  రాజకీయ భవిష్యత్ ప్రణాళికల పైన చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవన్ తో పాటుగా ఆయన పార్టీని కూడా గెలిపించాలి అని.. అందుకు తగిన కార్యక్రమాలు చేయాలి అని చర్చించుకున్నట్లు తెలుస్తుంది.

You may also like