Home » విష్ణుకు షాక్ ఇచ్చిన మంచు ల‌క్ష్మి….అదంతా క‌వ‌రింగ్ కోస‌మేనా..?

విష్ణుకు షాక్ ఇచ్చిన మంచు ల‌క్ష్మి….అదంతా క‌వ‌రింగ్ కోస‌మేనా..?

by AJAY
Ad

మంచు వారి ఇంట జ‌రిగిన గొడ‌వ ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రెటీల ఫ్యామిలీ అయినా ఎవ‌రి ఫ్యామిలీ అయినా గొడ‌వ‌లు జ‌ర‌గ‌టం కామ‌న్ కానీ దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయ‌డంతో ఇంట్లో గొడ‌వ ఊర్లో ప‌డిన‌ట్ట‌య్యింది. వైర‌ల్ అయిన‌ వీడియోలో మంచు విష్ణు ఆవేశంతో ఊగిపోతుంటే ఇద్ద‌రు వ్య‌క్తులు విష్ణును ఆపుతున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో మనోజ్ వాయిస్ వినిపిస్తుంది. ఇలా ఇండ్ల పైకి వ‌చ్చి బంధువుల‌ను స‌న్నిహితుల‌ను కొడ‌తాడు అంటూ మ‌నోజ్ చెబుతున్నాడు.

Advertisement

అయితే ఆ వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో మీడియాలో మారుమోగిపోయిన సంగ‌తి తెలిసిందే. అదే విష‌యం పై మ‌నోజ్ ను ప్ర‌శ్నిస్తే ఆయ‌నే వీడియో షేర్ చేసి టీవీ 9 కే తెలుసు అంటూ స‌మాధానం ఇచ్చారు. మంచూస్ రియాలిటీ షో కోస‌మే ఇలా చేశామని సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఆ రియాలిటీ షో వస్తోంది పేర్కొన్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే మంచు విష్ణు అదంతా ఓ రియాలిటీ షో కోసం అంటూ మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో ఏది నిజ‌మో ఏది అబ‌ద్ద‌మో తెలియ‌క ఫ్యాన్స్ అయోమ‌యంలో ప‌డ్డారు. ఇదిలా ఉంటే తాజాగా మంచు ల‌క్ష్మిని రియాలిటీ షో గురించి ప్ర‌శ్నించ‌గా తాను ఎటువంటి షో చేయ‌డం లేద‌ని స‌మాధానం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా మ‌నోజ్ టీమ్ లోని ఓ వ్య‌క్తి కూడా ఈ వ్య‌వ‌హారం పై స్పందించ‌న‌ట్టు తెలుస్తోంది. మ‌నోజ్ కు సార‌థి ఇంట్లో గొడ‌వ జ‌రుగుతుంద‌ని ఫోన్ వ‌స్తే అక్క‌డ‌కు వెళ్లాడ‌ని ఎలాంటి షూటింగ్ కోసం వెళ్ల‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. దాంతో మంచు ల‌క్ష్మి క‌వ‌రింగ్ కోస‌మే రియాలిటీ షో అంటూ వీడియో షేర్ చేశాడా అంటూ నెటిజ‌న్ లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ALSO READ :DASARA:ఎవరీ శ్రీకాంత్ ఓదెలా..ఆయన గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజాలు..!!

Visitors Are Also Reading